గ్రామీణ కేబుల్ ఆపరేటర్లతో కలసి బ్రాడ్ బాండ్ వ్యాపారం: ఎయిర్ టెల్

1
750

ఎయిర్ టెల్ డిటిహెచ్ వ్యాపారం ఎదుగుదల కోవిడ్ లాక్ డౌన్ కాలంలో అంతంత మాత్రంగానే ఉంది. ముఖ్యంగా వ్యాపార కార్యాలయాలు కొన్ని చోట్ల కనెక్షన్లు ఉపసంహరించుకోగా వలస కూలీలు స్వస్థలాలకు తరలిపోవటం మరో కారణమని ఎయిర్ టెల్ స్వయంగా చెబుతోంది. ఒకవైపు మళ్ళీ ఈ కనెక్షన్లు పొందటానికి నానా కష్టాలు పడుతూనే ఇప్పుడు బ్రాడ్ బాండ్ మీద దృష్టి సారించింది. డిటిహెచ్ ద్వారా బ్రాడ్ బాండ్ ఇవ్వలేకపోవటం ఆవ్యాపారంలో ప్రధానమైన అవరోధం కాగా ఎమ్మెస్వోలకు కేబుల్ ద్వారా బ్రాడ్ బాండ్ వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఎయిర్ టెల్ ఇప్పుడు స్థానిక కేబుల్ ఆపరేటర్లతో ఒప్పందాలు చేసుకుంటూ బ్రాడ్ బాండ్ వ్యాపారాన్ని పెంచుకోవాలని ఆలోచిస్తోంది.
“దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలలో బ్రాడ్ బాండ్ వ్యాపారానికి భారీ అవకాశాలున్నాయని మేం నమ్ముతున్నాం. ఇప్పటికే 14 చోట్ల ఇలాంటి భాగస్వామ్యాలకు శ్రీకారం చుట్టాం” అన్నారు ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్. ఇలాంటి భాగస్వామ్యాల ద్వారా ఎయిర్ టెల్ బ్రాడ్ బాండ్ వ్యాపారం పెరిగింది. అయితే, డిటిహెచ్ కనెక్షన్లు మాత్రం లాక్ డౌన్ సమయంలో కొన్ని చిన్న చిన్న వ్యాపార కార్యాలయాలు, షాపులు మూతపడటం వల్ల ఆగిపోయాయని ఆయన ఒప్పుకున్నారు. అందుకే ఆ నష్తాన్ని పూడ్చుకోవటానికి బ్రాడ్ బాండ్ మీద దృష్టి సారిస్తామన్నారు.

5G కి సిద్ధంగా ఉండే సాఫ్ట్ వేర్ లో భారతదేశంలోనే తొలి ఆపరేటర్ గా ఉండటాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి అవరోధాలూ లేకుండా 5G అందించగలమన్నారు. ప్రస్తుతానికి ఎయిర్ టెల్ సంస్థ లాబ్ లోనే 5G సొల్యూషన్స్ ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోందని, వాడకంలోకి రావటానికి ఎలాగూ కొన్ని ఏళ్ళు తప్పకపోవచ్చునని అన్నారు. సరైన వాడకం. పరికరం అందుబాటు, గిట్టుబాటు ధరకు స్పెక్ట్రమ్ అందుబాటు లాంటివి ఒక కొలిక్కి రావటానికి ఆ మాత్రం సమయం అవసరమవుతుందని ఎయిర్ టెల్ సీఈవో అభిప్రాయపడ్డారు.

1 COMMENT

Leave a Reply to Mdfasiuddin Cancel reply

Please enter your comment!
Please enter your name here