స్టార్ మా నెం.1, టాప్ 5 ప్రోగ్రామ్స్ లోకి జీ సీరియల్స్

0
453

డిసెంబర్ 25 తో ముగిసిన వారానికి బార్క్ అందజేసిన ప్రేక్షకాదరణ సమాచారం ప్రకారం స్టార్ మా చానల్ జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలోనూ, తెలుగులో నెంబర్ వన్ స్థానంలోనూ ఉంది. తెలుగులో రెండో స్థానంలో జీ తెలుగు, మూడో స్థానంలో ఈటీవీ తెలుగు, నాలుగో స్థానంలో జెమిని టీవీ ఉన్నాయి. అయితే, ఈటీవీ తెలుగు, జెమినీ టీవీ ప్రేక్షకాదరణ తగ్గినట్టు బార్క్ సమాచారం తెలియజేస్తున్నది. స్టార్ మా రేటింగ్స్ లో జీ తెలుగు 68%, ఈటీవీ 53%, జెమినీ టీవీ 37% మాత్రమే ఉండటం గమనార్హం.
కార్యక్రమాల విషయానికొస్తే కొన్ని నెలల తరువాత టాప్ 5 లో రెండు జీ టీవీ సీరియల్స్ కు స్థానం దక్కింది. అంతకు ముందు అన్నీ మా టీవీ సీరియల్స్ మాత్రమే ఉంటూ వచ్చాయి. కార్తీక దీపం మొదటి స్థానంలో ఉండగా, ఇంటింటి గృహలక్ష్మి, దేవత రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. నాలుగో స్థానంలోను ఐదో స్థానంలోను జీ తెలుగు సీరియల్స్ త్రినయని, రాధమ్మ కూతురు ఉన్నాయి. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అత్యధిక రేటింగ్స్ సంపాదించుకుంది. భారత దేశంలో మరే ఇతర బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి ఈ స్థాయిలో రేటింగ్స్ రాకపోవటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here