ట్వెంటియత్ సెంచరీ ఫాక్స్ టెలివిజన్ ఇకమీదట ట్వెంటియత్ టెలివిజన్

0
494

మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో చరిత్రాత్మక బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న ట్వెంటియత్ సెంచరీ ఫాక్స్ టెలివిజన్ పేరు కనుమరుగు అవుతోంది. యాజమాన్య సంస్థ డిస్నీ ఈ మార్పును ప్రకటిస్తూ ఇక మీదట ఇది ట్వెంటియత్ టెలివిజన్ గా మాత్రమే ఉంటుందని చెప్పింది. నిరుడు విలీనం అయిన తరువాత రెండు బ్రాండ్ పేర్లతో వినియోగదారులు అయోమయానికి గురికాకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

ఇప్పుడు బ్రాండ్ పేరులో మార్పు తరువాత లోగో లోఉన్న ట్వెంటియత్ టెలివిజన్ మాత్రమే ఉండిపోయి మధ్యలో ఉన్న సెంచరీ, ఫాక్స్ అనే పదాలు రెండూ తొలగిపోతాయి. అదే విధంగా డిస్నీ తన ఇతర సంస్థల పేర్లలోనూ కొద్దిపాటి మార్పులు చేసింది. ఎబిసి స్టుడియోస్ ను ఇకమీదట ఎబిసి సిగ్నేచర్ స్టుడియోస్ గా మార్చాలని ఫాక్స్ 21 టెలివిజన్ స్టుడియోస్ ను టచ్ స్టోన్ టెలివిజన్ గాను మార్చాలని నిర్ణయించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here