జాతీయ స్థాయిలో నెంబర్ వన్ ఎమ్మెస్వో జీటీపీఎల్ హాత్ వే

0
1123

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం జీటీపీఎల్ హాట్ వే లిమిటెడ్ దేశంలోనే నెంబర్ వన్ ఎమ్మెస్వోగా నిలిచింది. దేశవ్యాప్తంగా మొత్తం 1745 మంది సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నుంచి అనుమతిపొందిన ఎమ్మెస్వోలు ఉండగా వాటిలో 13 మాత్రమే 10 లక్షలకు పైగా కనెక్షన్లకు సేవలందిస్తున్నాయి. వాటిలో కూడా నాలుగు మాత్రమే 45 లక్షలకు మించిన కనెక్షన్లు సంపాదించుకున్నాయి. అవి: జీటీపీఎల్ హాత్ వే (7,799,167), సిటీ నెట్ వర్క్స్ (7,649,554), హాట్ వే డిజిటల్ (5,505,062), డెన్ నెట్వర్క్స్ (4,670,618).

అంతకు ముందు కేబుల్ రంగంలో తిరుగులేని నెంబర్ వన్ గా సిటీ నెట్ వర్క్స్ చెలామణిలో ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు తాజాగా ట్రాయ్ వెల్లడించిన సమాచారం ప్రకారం సిటీ నెట్వర్క్స్ రెండో స్థానానికి పడిపోయింది. కేబుల్ కనెక్షన్లు తగ్గిపోవటానికి ఒకవైపు ఓటీటీ, మరోవైపు డీటీహెచ్ కారణమవుతున్న సమయంలోనూ జీటీపీఎల్ తన చందాదారులని నిలబెట్టుకోవటంలో ప్రత్యేకతను చాటుకొని ఎంతోకాలంగా మొదటిస్థానంలో ఉన్న సిటీ నెట్వర్క్స్ ను వెనక్కు నెట్టగలిగింది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రతి మూడు నెలలకొకసారి బ్రాడ్ కాస్టింగ్ రంగానికి సంబంధించినసమాచారాన్ని ఒక నివేదిక రూపంలో విడుదల చేస్తుంది. 2020 సెప్టెంబర్ 30 తో ముగిసిన త్రైమాసికానికి తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం జీటీపీఎల్ హాత్ వే దేశంలో నెంబర్ వన్ ఎమ్మెస్వో హోదా పొందింది. 15 రాష్ట్రాలలో వెయ్యికి పైగా పట్టణాలలో ఉన్న జీటీపీఎల్ హాత్ వే లిమిటెడ్ సంస్థ కేబుల్ టీవీ పంపిణీతోబాటు హై స్పీడ్ బ్రాడ్ బాండ్ సర్వీస్ అందిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here