ఇప్పటికే ఎయిర్ టెల్ డీటీహెచ్ నాడుపుతున ప్రముఖ టెలికాం సంస్థ భారత్ఈ ఎయిర్టెల్ ఇప్పుడు సుభాష్ చంద్ర ఆధ్వర్యంలోని జీ గ్రూప్ వారి డీటీహెచ్ వేదిక డిష్ టీవీ ని కూడా కొంటున్నది. డిష్ టీవీ ఇండియా సంస్థలో మెజారిటీ వాటా కొనుగోలుకు సిద్ధమైంది. ఈ దిశలో చర్చలు సాగుతున్నాయి.
ఈ విషయంలో ఎయిర్ టెల్ ప్రతినిధులు డిష్ టీవీ మాతృసంస్థ అయిన ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రతో సమాలోచనలు మొదలుపెట్టారు. ఆర్థిక సలహా సంస్థ ఈవై ఇప్పటికే డిష్ టీవీ ఆర్థిక వ్యవహారాలను మదింపు చేసినట్టు, అక్టోబర్ 25 నాటికే నివేదిక సమర్పించినట్టు సమాచారం. ఇప్పటికే డిష్ టీవీకి, ఎస్ బాంకు మధ్య బోర్డు రూమ్ సంఘర్షణ సాగుతూ ఉంది. ఈ కంపెనీలో ఎస్ బాంక్ వాటా 25.63 శాతం ఉంది. ప్రస్తుతం డిష్ టీవీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జవహర్ గోయెంకాతోబాటు డైరెక్టర్లు డాక్టర్ రాష్మీ అగర్వాల్, భగవాన్ దాస్ నారంగ్, శంకర్ అగర్వాల్, అశోక్ మతాయ్ కురియెన్ ను తప్పుకోవాలని ఎస్ బాంక్ కోరుతోంది.
