బేసిక్ ప్యాక్ లో జెమిని చానల్స్ ఇవ్వాలి, ఈనెల25న చలో విజయవాడ APCO JAC

0
683

ఏ. పి.ఫైబర్ కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలని పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 25 న ఆంధ్ర ప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఛలో విజయవాడ కార్యక్రమనికి పిలుపు నిచ్చింది.ఏ. పి.ఫైబర్ లో జెమిని కి సంబందించిన అన్ని చానళ్ల ను నిలిపివేయడం మూలముగా వినియోగదారుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్న నేపథ్యం లో   ఎ.పి.ఫైబర్ ఆపరేటర్ల పరిస్థితి అయోమయంలో పడింది.ఆపరేటర్ల కు ఇచ్చే కమిషన్ కూడా తగ్గించడం తో  ఆపరేటర్ లు దిక్కుతోచని పరిస్థితి లో ఉన్నారు . ఏ. పి.ఫైబర్ ను ఆపరేటర్లు ముందుకు తీసుకు వెళ్ల లేని పరిస్థితి. ప్రభుత్వం జోక్యం చేసుకుని కేబుల్ ఆపరేటర్ల  ఉనికిని కాపాడాలని విన్నవించి తమ నిరసన తెలియచేసేందుకు ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపు నిచ్చినట్లు APCO JAC చైర్మన్ పసలాపూడి సీతా రామయ్య,కోఆర్డినేటర్ ఉప్పులూరి జానకిరామయ్యా పత్రిక ప్రకటనలో తెలియ చేశారు.

ఇవే సమస్యలపై  కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి అద్వర్యం లో ఆపరేటర్ లు ర్యాలీ గా వెళ్లి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు , ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఈరంగం మీద ఆదారపడ్డ ఆపరేటరలను ఆదుకోవాలని, డమ్మీ ఆపరేటర్ లను సృష్టించకూడదని ,బేసిక్ ప్యాక్ లో  జెమిని చానల్స్ ఇవ్వాలని, ఆపరేటర్ లకు షేర్ పెంచాలని అన్నారు ,తమకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇప్పిస్తే తమ భాదలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళుతామని ,ఆయన తప్పక తమకు న్యాయం చేస్తారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here