జీ గ్రూప్ లో నెం.1 చానల్ జీ తెలుగు

0
693

జాతీయ స్థాయిలో జీ గ్రూప్ చానల్స్ అన్నిటిలో జీ తెలుగు ముందుండటం విశేషం. టెలివిజన్ ప్రేక్షకాదరణను లెక్కించే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్ ) అందించే వారం వారం సమాచారం ప్రకారం జీ తెలుగు కొంతకాలంగా జాతీయ స్థాయి టాప్ 10 చానల్స్ లో స్థానం కొనసాగిస్తూ ఉంది.
అంతే కాదు, జీ గ్రూప్ లో మెయిన్ చానల్ కు సైతం టాప్ 10 లో స్థానం దక్కకపోగా తెలుగుకు మాత్రమే అలాంటి ఘనత దక్కింది. అదే విధంగా దక్షిణాది టాప్ 5 చానల్స్ లోనూ జీ తెలుగు స్థానం పదిలంగా ఉంది.
జాతీయ స్థాయిలో నాలుగు ప్రధాన మెట్రో నగరాలలో అత్యధిక ప్రేక్షకాదరణ ఉన్న టాప్ 5 చానల్స్ జాబితాలో ఒకే ఒక్క తెలుగు చానల్ కు స్థానం దక్కగా అది జీ తెలుగు కావటం మరోవిశేషం. అంటే, మహానగరాలలో ప్రేక్షకులు జీ తెలుగును ఎక్కువగా ఆదరిస్తున్నారని అర్థం. దీన్నిబట్టి మహానగరాలలో ఉన్న తెలుగు ప్రేక్షకులు ఇతర తెలుగు చానల్స్ కంటే జీ తెలుగువైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here