జాతీయ స్థాయిలో స్టార్ మా నెంబర్ 1

0
696

స్టార్ మా తెలుగు చానల్ ఇప్పుడు మళ్ళీ జాతీయ స్థాయిలో నెంబర్ వన్ అయింది. తాజాగా ఈ ఏడాది ఆరోవారానికి బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్) అందజేసిన ప్రేక్షకాదకరణ సమాచారం ప్రకారం టాప్ టెన్ చానల్స్ జాబితాలో స్టార్ మా మొదటి స్థానంలో ఉండగా ఈ మధ్య కాలంలో వరుసగా నెంబర్ వన్ గా ఉంటున్న సన్ టీవీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. స్టార్ ఉత్సవ రెండో స్థానం దక్కించుకుంది.
టాప్ 10 లో ఐదు రాంకులు స్టార్ గ్రూప్ చానల్స్ దక్కించుకోగా అందులో స్టార్ మా, స్టార్ విజయ్ రెండూ దక్షిణాది చానల్స్ కావటం కూడా విశేషం. ఇవే కాకుండా ఈ గ్రూప్ కి చెందిన స్టార్ ప్లస్, స్ట్రా జల్సా కూడా టాప్ 10 లో ఉన్నాయి. జీ గ్రూప్ లో జీటీవీ ఒక్కటి మాత్రమే ఇందులో స్థానం దక్కించుకోగా సోనీ చానల్స్ రెండున్నాయి. కలర్స్ చానల్స్ ఒక్కటి కూడా లేదు.
ఇక తెలుగులో స్టార్ మా (23.28 లక్షల సగటు ప్రేక్షక నిమిషాలు) మొదటి స్థానం దక్కించుకోవటమే కాకుండా, ఆ తరువాత రెండు రాంకులలో ఉన్న జీ తెలుగు (13.56 లక్షల సగటు ప్రేక్షక నిమిషాలు), ఈటీవీ తెలుగు ( 10.09 లక్షల సగటు ప్రేక్షక నిమిషాలు)చానల్స్ ఉమ్మడిగా సాధించుకున్న ప్రేక్షకాదరణకు సమానంగా ఉండటం విశేషం. జెమినీ టీవీ కేవలం 707 సగటు ప్రేక్షక నిమిషాలతో నాలుగో స్థానంలో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here