‘కేబుల్ వినియోగదారుల కరదీపిక’ విడుదలచేసిన ట్రాయ్

0
704

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కేబుల్ వినియోగదారుల సౌకర్యార్థం వారికి అవసరమైన సమాచారంతో ఒక కరదీపికను రూపొందించి తన వెబ్ సైట్ లో పెట్టింది. “ఇది కేబుల్ చందాదారుల ప్రయోజనాలను కాపాడటానికి, వారి సాధికారత పెంచటానికి పనికొస్తుంది” అని ట్రాయ్ పేర్కొంది. ట్రాయ్ ఎంతోకాలంగా వినియోగదారులకు సంబంధించి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు, ఆదేశాలు, నియంత్రణలు, జారీ చేస్తూ వస్తున్నప్పటికీ, వాటి మొత్తం సారాంశాన్ని వినియోగదారుల కోణంలో ఒక పుస్తకంగా క్రోడీకరించి ఇవ్వటం ద్వారా వినియోగదారులకు, వినియోగదారుల సంఘాలకు అవగాహన పెంచటానికి పనికొస్తుందని భావిస్తున్నట్టు ట్రాయ్ ఈ పుస్తకం ముందుమాటలో పేర్కొంది.
2017 మార్చి లో ట్రాయ్ బ్రాడ్ కాస్టింగ్, కేబుల్ సేవలకు సంబంధించి సమగ్రమైన ఒక కొత్త నిబంధనావళి రూపొందించింది. అయితే ఇది 2018 డిసెంబర్ 29 నుంచి అమలులోకి వచ్చింది. ఈ కొత్త నిబంధనల వలన బ్రాడ్ కాస్టింగ్, కేబుల్ సేవల రంగం ఎదుగుదల, ఈ రంగంలోని వివిధ విభాగాలు సమానంగా పోటీ పడే అవకాశం లభించటంతోబాటు వినియోగదారుల స్వేచ్చ బాగా పెరిగింది. “ ఈ కరదీపిక టీవీ చందాదారులలో వాళ్ళ హక్కుల పట్ల అవగాహన పెంచటానికి ట్రాయ్ ఇచ్చిన స్వేచ్చను అనుభవించటానికి ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాం” అని ట్రాయ్ ఈ పుస్తకం ముందుమాటలో పేర్కొంది.
ఈ 25 పేజీల కరదీపికలో అంశాలను ఐదు అంశాలుగా విభజించి ఇచ్చారు . (ఎ) భారతదేశంలో బ్రాడ్ కాస్టింగ్ సేవలు (బి) టీవీ సేవలు అందుకోవటం (సి) ధరలు, బిల్లింగ్ (డి) సమాచారం కోసం, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలి (ఇ) వినియీగదారుల అవగాహన పెంపుకోసం ట్రాయ్ చేపట్టిన చర్యలు
ఈ పుస్తకాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ట్రాయ్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చ్ఏసుకోవచ్చు. ఇది వినియోగదారులకు, రిజిస్టర్ చేసుకున్న వినియోగదారుల సంఘాలకు ఉద్దేశించిన కరదీపిక. ట్రాయ్ ఏర్పాటు చేసిన వినియోగదారుల సమావేశాలు జరిగినప్పుడు కూడా ఈ పుస్తకం ప్రతులు పంపిణీ చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here