డిష్ టీవీ తాకట్టు వార్తలపై సుభాష్ చంద్ర వివరణ

0
533

సుభాష్ చంద్ర సారధ్యంలోని ఎస్సెల్ గ్రూప్ కోసం ఆయన కుమారుడు జవహర్ గోయెల్ తాను ఎండీగా ఉన్న డిటిహెచ్ సంస్థ డిష్ టీవీ వాటాలను హామీగా పెట్టారు. దీంతో ఈ విషయం మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. వాటి వాటాల ధర విషయంలోనూ ఏదో మతలబు ఉన్నదన్న పుకార్లు రావటంతో సుభాష్ చంద్ర సంస్థ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇది తాత్కాలిక సర్దుబాటు మాత్రమేనని, త్వరలోనే ఆ హామీని విడిపిస్తామని ప్రకటించాల్సి వచ్చింది.
సుభాష్ చంద్ర గ్రూప్ తీసుకున్న అప్పుకు గాను జవహర్ గోయల్ తన డిష్ టీవీలో వాటాలను హామీగా ఇవ్వటం నిజమేనని, అందుకు ఎస్సెల్ గ్రూప్ ధన్యవాదాలు చెబుతోందని వివరణ ఇచ్చారు. అయితే, త్వరలోనే వాటిని విడిపించి ఇస్తామని కూడా చెప్పారు. గోయల్ తన వాటాలు ఇచ్చారే తప్ప సంస్థను కాదని, స్వయంగా తానే ఇవ్వటానికి ముందుకు వచ్చారని, ఇందులో ఎలాంటి వత్తిడీ లేదని కూడా వివరణ ఇచ్చారు.
వాటాలు తాకట్టుగా పెట్టుకున్నవారు చాలా ఎక్కువ ధరకు మరో ఇన్వెస్టర్ కు అమ్మినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఇవన్నీ పుకార్లు మాత్రమేనని, కంపెనీకి అలాంటి ఆలోచనలు లేవని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రుణదాతలతో ఎలాంటి సమస్యలూ లేవని, ఇంతకుముందు కష్టకాలంలో కూడా అన్నీ పరిష్కరించుకోగలిగామని సుభాష్ చంద్ర గ్రూప్ అధికార ప్రతినిధి రోనక్ జత్వాలా ఆ ప్రకటనలో తెలియజేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here