డిటిహెచ్ చందాదారులు పెరిగారు: ట్రాయ్

0
660

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) మధ్య కాలంలో డిటిహెచ్ చందాదారులు పెరిగినట్టు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వారి టెలికామ్ సర్వీసెస్ పెర్ఫార్మర్స్ ఇండికేటర్స్ వెల్లడించింది. ట్రాయ్ ప్రతి త్రైమాసికం ఈ సమాచారం విడుదలచేయటం తెలిసిందే. ఈ పెరుగుదల వరుసగా రెండో త్రైమాసికం కూడా నమొదు చేసుకోవటం విశేషం కాగా ఈ కాలామంతా కోవిడ్ లాక్ డౌన్ సమయం కావటం వల్ల ఆ పెరుగుదల శాశ్వతమా కాదా అనేది మూడో త్రైమాసికంలో తేలే అవకాశం ఉంది. మొదటి త్రైమాసికం కంటే రెండో త్రిమాసికంలో పెరుగుదల నామమాత్రం కావటం కూడా విశేషం.
జూన్ ఆఖరునాటికి డిటిహెచ్ చందాదారుల సంఖ్య 7 కోట్ల 5 లక్షల 80 వేలు కాగా అంతకు ముందు త్రైమాసికం మార్చి ఆఖరునాటికి చందాదారుల సంఖ్య 7 కోట్ల 2 లక్షల 60 వేలు ఉంది. అదే డిసెంబర్ ఆఖరునాటికి 6 కోట్ల 99 లక్షల 80 వేలుగా నమోదైంది.
డిటిహెచ్ లో ఆపరేటర్లవారీగా చందాదారుల లెక్కల విషయానికొస్తే, టాటా స్కై తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ మార్కెట్ లో 32.09% దక్కించుకుంది. గడిచిన ఏడాది కాలంలో మొత్తం 7.5 లక్షల చందాదారులను పెంచుకుంది. ఆ విధంగా చూస్తే డిటిహెచ్ రంగం ఎదుగుదలతోబాటే టాటా స్కై కూడా ఎదుగుతూ వచ్చింది. రెండో స్థానంలో ఉన్న డిష్ టీవీ 28.67 % వాటా దక్కించుకోగా ఎయిర్ టెల్ భారతీ 23.83 % తో మూడో స్థానంలో ఉండగా సన్ డైరెక్ట్ 15.41% తో చివరి స్థానంలో ఉంది.
భారతదేశంలో జూన్ 30 నాటికి అనుమతిపొందిన శాటిలైట్ చానల్స్ సంఖ్య 909 కాగా వాటిలో 332 పే చానల్స్, మిగిలిన 577 ఉచిత చానల్స్. పే చానల్స్ లో 97 హెచ్ డి చానల్స్ ఉన్నాయి. డిజిటల్ ఎమ్మెస్వోలుగా అనుమతి పొందినవారు 1666 మంది. పది లక్షలకు పైగా చందాదారులున్న ఎమ్మెస్వోలు 12 మంది, హిట్స్ ఆపరేటర్ (హిందుజా వారి ఎన్ ఎక్స్ టి డిజిటల్) ఉన్నారు.


ట్రాయ్ విడుదలచేసిన తాజా నివేదికలో మొత్తం ఇంటర్నెట్ చందాదారుల సంఖ్య 74 కోట్ల 31 లక్షల 90 వేల నుంచి జూన్ ఆఖరు నాటికి 74 కోట్ల 90 లక్షల 70 వేలకు పెరిగింది. దీన్నిబట్టి త్రైమాసికానికి 0.79% పెరుగుదల నమోదు చేసుకున్నట్టయింది. బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ చందాదారులు మార్చి ఆఖరుకు 2కోట్ల 24 లక్షల 20 వేలు ఉండగా జూన్ ఆఖరునాటికి 2.86% పెరుగుదల నమోదు చేసుకుంటూ 2కోట్ల 30 లక్షల 60 వేలకు చేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here