ప్రముఖ మీడియా ఛానల్‌ను కొనుగోలు చేసిన హీరో రామ్‌చరణ్

0
530

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఒకవైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతగానూ కొనసాగుతున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీని స్థాపించి ఆయన సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హీరో రామ్‌చరణ్ మీడియా రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఓ ప్రముఖ మీడియా ఛానల్‌ను కొనుగోలు చేసినట్లు ఫిలింనగర్‌లో టాక్ వినపడుతోంది. ఈ న్యూస్ విన్న మెగా అభిమానులు ఎంతో ఖుష్ అవుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకైనా మీడియా అండదండలు అవసరం. ఎందుకంటే తమ పార్టీ కార్యక్రమాలను, ప్రణాళికలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోతే ఆ పార్టీ మనుగడ కొనసాగించడం కష్టం అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో చూసుకుంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి నమస్తే తెలంగాణ, టీ న్యూస్ వంటి సొంత మీడియా అండగా ఉండగా.. మరోవైపు ఏపీలో అధికార వైసీపీకి సాక్షి లాంటి సొంత మీడియా ఎంతో వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఇక టీడీపీకి మద్దతిచ్చే ఛానళ్లు మూడు, నాలుగు ఉండనే ఉన్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఈటీవీ లాంటి మీడియా ఉంది కాబట్టే టీడీపీ నెట్టుకువస్తోంది. అయితే మెగా అభిమానులకు సొంత మీడియా లేకపోవడం వల్లే 2009 ఎన్నికల్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ అనుకున్నవిధంగా ఫలితాలను సాధించలేకపోయాయి. మెగా అభిమానులకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ తక్కువేమీ ఉండదు. కానీ ఆ ఫాలోయింగ్‌ను ఓట్ల రూపంలోకి మార్చులేకపోవడానికి మీడియా లేకపోవడమే కారణమని పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. అదే సొంత మీడియా ఉండి ఉంటే ప్రజారాజ్యం, జనసేన పార్టీల రేంజ్ మరోలా ఉండేదని ఆ పార్టీల అభిమానులే చెప్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here