దక్షిణాది మార్కెట్ మీద కన్నేసిన ఇన్10 మీడియా నెట్ వర్క్

0
630

ఐదు చానల్స్ నడుపుతున్న ఇన్ 10 మీడియా నెట్ వర్క్ ఇప్పటికే కిక్కిరిసిన దక్షిణాది మార్కెట్ మీద కన్నేసింది. ఇప్పుడు పిల్లల చానెల్ ఒకటి ప్రారంభించగా అంతకు ముందు కొద్ది నెలల కిందట ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్ ప్రారంభించటం తెలిసిందే. మార్కెట్లో ఇప్పటికే కాకలు తీరిన చానల్స్ ను డీకొట్టటానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.

ఏప్రిల్ లో ఈ నెట్ వర్క్ వారి పిల్లల చానల్ “ గుబారే “ ఇంగ్లిష్ హిందీతోబాటు తమిళంలోను, తెలుగులోను ఆడియో ఫీడ్ ప్రసారం చేయటం ప్రారంభించింది. పేరుమోసిన కార్యక్రమం “వీర్ ది రోబో బాయ్” తో ఇలా దక్షిణాది భాషల ఫీడ్ ఇవ్వటం మొదలైంది. త్వరలో లవ్ కుశ్, మార్కస్ ఖిలాడీ లాంటి కార్యక్రమాలు సైతం దక్షిణాది భాషల్లో ఇవ్వబోతోంది. మిగిలిన చానల్స్ ను సైతం అలా ఇతర భాషల్లో అందించే ప్రయత్నం ప్రారంభించింది. భారతదేశపు ఇన్ఫొటైన్మెంట్ చానల్ ఎపిక్ టీవీ ప్రారంభమైన కొద్ది నెలల్లోనే విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దక్షిణాది వారికోసం జూన్ 15 నుంచి ఇంగ్లిష్ లో ప్రసారాలు అందించబోతోంది.

దక్షిణాది మార్కెట్ లో ప్రకటనల ఆదాయం గణనీయంగా ఉండటంతో ఈ నెట్ వర్క్ ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకొని ఈ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికే దక్షిణాది మీద్ అదృష్టిపెట్టి స్టార్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్, వయాకామ్ 18 లాంటి పెద్ద నెట్ వర్క్స్ తమ దక్షిణాది చానల్స్ ప్రారంభించటం తెలిసిందే. దీంతో ప్రాంతీయ మార్కెట్ బ్రాడ్ కాస్టర్లకు, అడ్వర్టైజర్స్ కు, ప్రైవేట్ ప్రొడ్యూసర్లకు తీవ్రమైన పోటీ ఏర్పడి ఒక యుద్ధ రంగంగా మారింది.

ఇన్ 10 నెట్ వర్క్ నిరుడు “ఫిల్మాచి” పేరుతో ఒక భోజ్ పురి సినిమా చానల్ ప్రారంభించటం ద్వారా అక్కడి ఎంటర్టైన్మెంట్ మార్కెట్ లో చెప్పుకోదగినవాటా సంపాదించుకోగలిగింది.నేక సినిమాల శాటిలైట్ హక్కులు సొంతం చేసుకోవటంతోబాటు కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ హక్కులు సైతం కొనుగోలు చేసింది. ప్రస్తుతం అక్కద టాప్ 5 లో స్థానం సంపాదించుకోగా త్వరలో టాప్ 3 లో స్థానం కోసం ప్రయత్నిస్తోంది.

ఈ సంస్థ మ్యూజిక్ చానల్ “ షోబాక్స్ “ లో 30% పంజాబీ మ్యూజిక్ ప్రసారమవుతుండగా ఇప్పటికే అది పంజాబీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్న లక్ష్యంతో ఈ నెట్ వర్క్ ఈ ఏడాది మార్చి 1న ఇషారా పేరుతో ఒక హిందీ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్ ప్రారంభించింది.

ప్రకటనదారులకు అఖిలభారత స్థాయిలో తన చానల్స్ ను పరిచయం చేయటం ఇన్ 10 మీడియా నెట్ వర్క్ తన లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని చానల్స్ లోనూ సొంత కంటెంట్ ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి వేగంగా అడుగులు వేస్తోంది. ప్రాంతీయ చానల్స్ దిశలో తొలి అడుగులే లక్ష్యం వైపు దాని చూపును తెలియజేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here