అమ్ముడుపోయిన ఎసిటి ఫైబర్ నెట్: చందాదారుల సంఖ్యే బలం

0
711

ఎసిటి ఫైబర్ నెట్ గా అందరికీ పరిచయమైన ఏట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ సంస్థ అమ్ముడు పోయింది. బెంగళూరు కేంద్రంగా నడిచే ఈ సంస్థ చెన్నై, హైదరాబాద్ సహాయ అనేక నగరాలలో కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తోంది. మొదట్లో ఫిక్సెడ్ లైన్ బ్రాడ్ బాండ్ సేవలతో మొదలై కేబుల్ రంగంలో ప్రవేశించటం తెలిసిందే. హైదరాబాద్ లో బీమ్ కేబుల్ కొనుగోలుతో మొదలుపెట్టి ఆ తరువాత నెల్లూరు, ఏలూరు, రాజమండ్రి, కాకునాడా విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాలకు కేబుల్ ద్వారా విస్తరించింది.

పది లక్షల బ్రాడ్ బాండ్ కనెక్షన్లకు తోడు మరో పది లక్షలకు పైగా ఉన్న కేబుల్ కనెక్షన్లు తెచ్చిపెట్టే ఆదాయం, వాటి కోసం కల్పించుకున్న మౌలికసదుపాయాల అంచనావిలువ ఆధారంగా 120 కోట్ల డాలర్లకు (భారత కరెన్సీలో రూ. 8,500 కోట్లకు ఎసిటి కి విలువ లెక్కించారు. అంతర్జాతీయ సంస్థ పార్టనర్స్ గ్రూప్ ఇప్పుడు ఎసిటి లో నియంత్రణ వాటాలను సొంతం చేసుకుంటోంది. నిజానికి కేబుల్ ఆపరేటర్లను, వారి పరిధిలోని చందాదారులను వారికి తెలియకుండానే అమ్ముకోవటం కార్పొరేట్ ఎమ్మెస్వోలకు అలవాటైపోయిందనటానికి ఇది నిదర్శనం. స్థానిక నెట్ వర్క్ యజమానులు కేబుల్ ఆపరేటర్లే అయినా, అమ్మకాల విషయానికొస్తే పరోక్షంగా అమ్ముకోవటం కార్పొరేట్ ఎమ్మెస్వోలకు అలవాటుగా మారింది.

జాతీయ స్థాయిలోనూ పేరున్న ఎసిటి సంస్థలో 7 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 20 లక్షలమండికి పైగా చందాదారులున్నారు. అందులో బ్రాడ్ బాండ్, కేబుల్ చందాదారులున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 19 నగరాలలో ఎసిటి సేవలు అందుతున్నాయి. దేశంలో డిజిటల్ పరివర్తనలో కీలకపాత్ర పోషించిన ఎసిటి సంస్థలో నియంత్రణ వాటాలు కొనటం పట్ల పార్టనర్స్ గ్రూప్ సంతోషం వ్యక్తం చేస్తోంది. కొత్త మార్కెట్లలో ప్రవేశించాలన్న తమ లక్ష్యానికి ఇది సరైన వేదిక అవుతుందని కూడా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మానస్ టాండన్ వ్యాఖ్యానించారు. సరికొత్త పాకేజీలతో వ్యాపారాభివృద్ధి ప్రణాళికలు రచిస్తామన్నారు.

పార్టనర్స్ గ్రూపుకు ఇప్పటికే భారతదేశంలో అనేక పెట్టుబడులున్నాయి. ఇంతకు ముందునుంచే పార్టనర్స్ గ్రూప్ ఎసిటీ లో కొంతమేర పెట్టుబడులు పెడుతూ వచ్చినట్టు ఎసిటి సీవో బాలా మల్లాది వెల్లడించారు. బాహుముఖంగా విస్తరిస్తున్న ఎసిటి ఇకమీదట అంతర్జాతీయ సంస్థ గొడుగుకిమద పనిచేస్తూ మరింత విస్తరిస్తుందని ఆయాన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టనర్స్ గ్రూప్ కు విశాల్ మెగా మార్ట్ లో కూడా వాటాలునానాయి. జూన్ 2021 నాటికి ఆ సంస్థ ఆస్తుల విలువ 8 లక్షల కోట్లకు పైగా ఉంది. ఆవాస్ ఫైనాన్షియర్స్, ఈకామ్ ఎక్స్ ప్రెస్ లాంటి ప్రముఖ వ్యాపార సంస్థలను నిర్వహిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here