జీ ఎంటర్టైన్మెంట్ కు బకాయి పడ్డ సిటీ నెట్ వర్క్స్, డిష్ టీవీ

0
887

ఈ వార్త మామూలుగా కాస్త ఆశ్చర్యం అనిపించవచ్చుగాని ఇది నిజం. అన్నీ జీ గ్రూప్ లో భాగమే. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ అనేది ప్రధానంగా జీ గ్రూప్ లోఎంటర్టైన్మెంట్ చానల్స్ విభాగం. న్యూస్ చానల్స్ నడిపేది జీ మీడియా కార్పొరేషన్. పంపిణీ సంస్థల్లో కేబుల్ విభాగం సిటీ నెట్ వర్క్స్ పేరు మీద ఉండగా డిటిహెచ్ విభాగం డిష్ టీవీని నడిపేది ఇంకో సంస్థ. అనీ ఒక గ్రూప్ కిందికే వచ్చినా. దేనికదే ఒక స్వతంత్ర సంస్థ.

ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఎంటర్టైన్మెంట్ చానల్స్ నడిపే జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ బాగానే ఉంది. కానీ అదే సంస్థనుంచి ప్రసారాలు పంపిణీ చేయటానికి తీసుకున్న సిటీ నెట్ వర్క్స్, డిష్ టీవీ మాత్రం కంటెంట్ తీసుకున్నందుకు గాను వసూలు చేసే చందాల మొత్తాన్ని  ఇవ్వలేక బాకీ పడ్దాయి. దీన్ని బట్టి బ్రాడ్ కాస్టర్ల లాభాల పరిస్థితి, పంపిణీ సంస్థల నష్టాల పరిస్థితి అర్థమవుతూ ఉంది. అందులోనూ డిష్ టీవీ కంటే సిటీ నెట్ వర్క్స్ మరింత ఎక్కువ బకాయి ఉండటం గమనిస్తే కేబుల్ నష్టాలు అర్థమవుతాయి.

కొద్దికాలం క్రితం  బకాయిలన్నీ దశలవారీగా చెల్లించటానికి ఒక పథకం సిద్ధం చేసుకున్నారు. ఆ విధంగా డిష్ టీవీ మాత్రం పాత బాకీలు వరుసగా చెల్లిస్తూ వస్తోంది. సిటీ నెట్ వర్క్స్ మాత్రం ఆ ప్లాన్ కు కూడా కట్టుబడి పాతబకాయిలు చెల్లించలేకపోతోంది.  ఈ ఏడాది రెండో త్రైమాసికం ఫలితాల గురించి మాట్లాడుతూ జీ ఎంటర్టైన్మెంట్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా ఈ వివరాలు వెల్లడించారు. కోవిడ్ తో సహా వేరు వేరు కారణాలు ఉండి ఉంటాయని కూడా ఆయనే సర్ది చెప్పుకున్నారు.

సిటీ నెట్ వర్క్స్ ప్రస్తుతం ప్రీపెయిడ్ పద్ధతిలో వసూలు చేసి ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నప్పటికీ, పాత బకాయిలు రూ.81.2 కోట్ల మేరకు ఇంకా చెల్లించాల్సి ఉంది. దీన్ని రాని బాకీగా రద్దు చేయలేదని, వసూలు చేయటానికి అన్ని ప్రయత్నాలూ చేస్తామని గోయెంకా చెప్పటం విశేషం. ఇది కాకుండా సిటీ కేబుల్ తన రుణదాతలకు వెంటవెంటనే చెల్లించాల్సిన రూ.97 కోట్లను కూడా తాత్కాలికంగా భరించి దాన్ని కూడా వసూలు చేసుకుంటామని వివరణ ఇచ్చారు.

మరోవైపు డిష్ టీవీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వలన పాత బకాయిలను వాయిదాల పద్ధతిలో  గడువు ప్రకారం కడుతూనే ప్రస్తుత నెలవారీ చెల్లింపులు కూడా చేస్తున్నదని జీ ఎంటర్టైన్మెంట్ సీఈవో చెప్పారు. గత మార్చి నాటికి డిష్ టీవీ 584 కోట్లు బకాయి ఉండగా ప్రస్తుతం అది 498 కోట్లకు  చేరింది. బకాయిలు తగ్గుతూ ఉండటం వలన త్వరలోనే అప్పు మొత్తం చెల్లిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here