మార్చిలో ఢిల్లీలో 28వ కన్వర్జెన్స్ ఇండియా ఎక్స్ పో

0
692

భారతదేశంలో బ్రాడ్ కాస్ట్, ఐసిటి, డిజిటల్ మీడియా కు సంబంధించిన అతిపెద్ద ప్రదర్శనగా పేరు మోసిన కన్వర్జెన్స్ ఎక్స్ పో న్యూఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో మార్చి 24,25,26 తేదీలలో మూడు రోజులపాటు జరుగుతుంది. ఈ రంగాలకు చెందినవారందరూ వచ్చే అవకాశం ఉండటం వలన సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించేవారికి కూడా ఇది అద్భుతమైన అవకాశం అవుతుంది.
1992 లో ప్రారంభమైన కన్వర్జెన్స్ ఇండియా వరుసగా భారీ ప్రదర్శనలు నిర్వహిస్తూ, భారతదేశపు టెక్నాలజీ ప్రదర్శనగా పేరుతెచ్చుకుంది. మొదట్లో కేవలం కమ్యూనికేషన్స్, ఐసిటి కి మాత్రమే పరిమితమైనా, క్రమంగా అన్నీ కలుపుకుంటూ కమ్యూనికేషన్స్, డిజిటల్ బ్రాడ్ కాస్ట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అగ్ మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్, ఎంబెడెడ్ టెక్నాలజీ, మొబైల్ డివైసెస్, యాక్సెసరీస్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ ను కూడా కలుపుకోగలిగింది.
మార్చిలో జరిగే ప్రదర్శనలో వివిధ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ప్రదర్శిస్తారు. ముఖ్యంగా టెలికామ్, బ్రాడ్ కాస్ట్, మొబైల్, ఐటి, డిజిటల్ మీడియా రంగాలవారితో బాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సంబంధిత సొల్యూషన్స్ కూడా ఇందులో స్టాల్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ పరిశ్రమలో ఉన్నవారు స్వయంగా పరిశీలించి కొత్త పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచుకొని కొనుగోలు చేయటానికి వీలుంటుంది.
దాదాపు 25 వేలమందికి పైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు. వారిలో ప్రభుత్వ అధికారులు, ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు, కేబుల్ టీవీ వృత్తి నిపుణులు, శాటిలైట్ నిర్వాహకులు, టెలిపోర్ట్ ఆపరేటర్లు, కేబుల్ సంఘాలు, బ్రాడ్ కాస్టింగ్ సంఘాలు పాల్గొంటాయి.
ఈ ప్రదర్శనకు హాజరుకావాలనుకునేవారు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు:
https://www.convergenceindia.org/visitor-registration.aspx

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here