జీ-ఇన్వెస్కో వివాదంపై 29 న విచారణ; 11న జీ బోర్డు సమావేశం

0
516

ఈ నెల 11 న బోర్డు సమావేశం జరపాలని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ నిర్ణయించింది. సెప్టెంబర్ 30 తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరపు రెండవ త్రైమాసికం ( జులై-సెప్టెంబర్) ఆర్థిక ఫలితాలకు ఆమోదముద్ర వేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. నిజానికి అక్టోబర్ 27 నే బోర్డు సమావేశం జరుపుతున్నట్టు ముందుగా బొంబాయ్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ కి తెలియజేసినప్పటికీ కోరమ్ లేని కారణంగా రద్దు చేశారు.

జీ ఎంటర్టైన్మెంట్ లో కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. 18% వాటాలున్న ఇన్వెస్కో, గ్లోబల్ చైనా ఫండ్ కలిసి అత్యవసర సర్వసభ్య సమావేశం జరపాలని డిమాండ్ చేస్తూ వచ్చాయి. జీ ఎంటర్టైన్మెంట్ లో ఆరుగురు డైరెక్టర్లను తొలగించి తాము సూచించిన వారిని డైరెక్టర్లుగా నియమించాలని, ఎండీ, సీవో గా ఉన్న పునీత్ గోయెంకా తప్పుకోవాలని కూడా పట్టుబడుతూ వచ్చాయి. అయితే, కొత్త డైరెక్టర్లను నియమించాలంటే ముందుగా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అనుమతి అవసరమని చెబుతూ ఆ డిమాండ్ ను పునీత్ గోయెంకా త్రోసిపుచ్చారు. అదే సమయంలో సోనీలో విలీనం ప్రతిపాదన తెరమీదికి రావటంతో ఈ వివాదం మరింత ముదిరింది. విలీనం వలన వాటాదారులకు లబ్ధి కలుగుతుందని, దీన్ని అడ్డుకుంటూ రిలయెన్స్ లో విలీనానికి ఇన్వెస్కో రహస్య ప్రతిపాదన చేసిందని పునీత్ గోయెంకా ఆరోపించటం పెను సంచలనానికి దారితీసింది. అయితే, సర్వసభ్యసమావేశం కోసం పట్టుబడుతున్న ఇన్వెస్కో కోర్టుకెక్కింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 29 న జరగాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here