డిష్ టీవీ డైరెక్టర్ల తొలగింపుకు ఎస్ బాంక్ డిమాండ్

0
656

జీ గ్రూప్ అధిపతి సుభాష్ చంద్ర స్థాపించిన, ఆయన కొడుకు జవహర్ గోయల్ సారధ్యంలో ఉన్న డిష్ టీవీ యాజమాన్యం తీరుమీద ఎస్ బ్యాంక్ అభ్యంతరాలు చెబుతోంది. సంస్థలో 25.63 శాతం వాటాలున్న ఎస్ బ్యాంక్ ఈనెల 27 న జరిగే డిష్ వార్షిక సర్వసభ్య సమావేశంలో డైరెక్టర్ల మార్పును కోరుతోంది. భారతదేశపు మొట్టమొదటి డిటిహెచ్ సంస్థ అయిన డిష్ టీవీ రైట్స్ ఇష్యూ ద్వారా రూ.1000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. అయితే ఇది కేవలం ప్రస్తుతం ఉన్న తమ వాటాను పలుచన చేసే ఉద్దేశ్యంతో సాగుతున్నదనని ఎస్ బ్యాంక్ వాదిస్తోంది. తమ భయంతరాలను లెక్కలోకి తీసుకోవటం లేదని, ఇప్పటికీ తామే అతిపెద్ద ఏకైక వాటాదారు అని ఎస్ బ్యాంక్ చెబుతోంది. ఇప్పుడున్న డైరెక్టర్లు రష్మీ అగర్వాల్, శంకర్ అగర్వాల్, భగవాన్ దాస్ నారంగ్, అశోక్, మతాయ్ కురియం లను డైరెక్టర్లుగా తొలగించాలని, మేమేజింగ్ డైరెక్టర్ స్థానంలో ఉన్న జవహర్ లాల్ గోఎల్ ను కూడా ఆ పదవి నుంచి తప్పిస్తే ఆయన చైర్మన్ హోదా కూడా పోతుందని ఎస్ బాంక్ వాదన. ఈ విషయమై కంపెనీల చట్టం లోని సెక్షన్ 169 కింద నోటీసులు జారీచేసినట్టు కూడా వెల్లడించిమిడ్. కొంతమంది మైనారిటీ వాటాదారుల అభిమాటానికి అనుగుణంగా నడుచుకుంటూ కంపెనీ వ్యవహరిస్తున్నతీరుమీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాస్తున్న లేఖలను పట్టించుకోవటం లేదని బాంక్ ఆక్షేపించింది. కొత్తగా మూలధన సేకరణకు వెళుతున్నట్టు సంస్థ మే 28న మీడియాకు చెప్పటాన్ని ప్రస్తావిస్తూ, ఆ విధ్య<ంగా వెయ్యికోట్లు సమీకరించుకోవాలనుకోవటం సరికాదని ఎస్ బాంక్ తన నోటీసులో స్పష్టం చేసింది. డైరెక్టర్ల బోర్డును పునర్వ్యవస్థీకరించాలన్న సూచనను పెడచెవిన పెట్టటాన్ని ఎస్ బాంక్ తీవ్రంగా పరిగాణస్తోంది . అయితే, ఈ నోటీసుకు డిష్ టీవీ సమాధానమిస్తూ, మీడియా సంస్థ గనుక ముందుగా సమాచారప్రసార మంత్రిత్వశాఖ నుంచి అనుమతి పొందిన తరువాతనే నియమించవలసి ఉంటుందని గుర్తుచేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here