పెరుగుతున్న వైర్డ్ ఇంటర్నెట్ కనెక్షన్లు

0
534

ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నవారిలో ఫోన్ లో వాడుకుంటున్నవారి శాతం 96.91 ఉన్నట్టు తాజాగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అంటే వైరు ద్వారా అందుకునేవాళ్ళు చాలా తక్కువగానే ఉన్నారు. అయితే, ఈ సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. మూడు నెలల కాలంలో వైరు ద్వారా ఇంటర్నెట్ అందుకుంటున్నవారి సంఖ్య 2 కోట్ల 35 లక్షల 80 వేల నుంచి 2 కోట్ల 44 లక్షల 70 వేలకు పెరిగింది. అంటే, 3 నెలల్లో దేశవ్యాప్తంగా దాదాపు 9 లక్షల కనెక్షన్లు పెరిగాయి.
అందుకే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లలో కూడా ప్రధానంగా వైర్ లెస్ ఇంటర్నెట్ కే ఎక్కువ మార్కెట్ వాటా ఉంది. ఇప్పుడున్న నలుగురు ప్రధాన ఆపరేటర్లను కనెక్షన్ల వారీగా చూస్తే రిలయెన్స్ జియో 42.88 కోట్లు (51.39%), భారత్ఈ ఎయిర్ టెల్ 22.93 కోట్లు (27.48%), వోడాఫోన్ ఐడియా 13.67 కోట్లు (16.39%), బి ఎస్ ఎన్ ఎల్ 2.71 కోట్లు ( 3.24%) ఉన్నాయి. మిగిలిన చిన్న ఆపరేటర్లందరి కనెక్షన్లు కలిపి 1.5% వాటా మాత్రమే ఉన్నాయి. అంటే, బి ఎస్ ఎన్ ఎల్ లో సగం కూడా లేవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here