ఈరోజు వీడియో, బ్రాడ్ బాండ్ వర్చువల్ సదస్సు

0
601

ఈ రోజు 18వ విడత వీడియో , బ్రాడ్ బాండ్ సదస్సు వర్చువల్ పద్ధతిలో ఏర్పాటైంది. ఇండియన్ టెలివిజన్ డాట్ కామ్ సంస్థ నిర్వహిస్తున్న ఈ సదస్సు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సాగుతుంది. ప్రకటించింది.టెలివిజన్ పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించటంతోబాటు భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జారీచేసిన రెండో టారిఫ్ ఆర్డర్ ( ఎన్టీవో 2.0) తరువాత ఎదురైన పరిస్థితులమీద చర్చ జరుగుతుంది. బ్రాడ్ బాండ్ ఆధారంగా పెరుగుతున్న డిజిటల్ వేదికల విస్తరణ, కోవిడ కారణంగా తగ్గుతున్న కేబుల్ డీటీహెచ్ కనెక్షన్లు, ప్రత్యామ్నాయ మార్గాలు, 5 జి అమలులోకి వచ్చిన తరువాత రాబోయే మార్పులు పరిశ్రమను ఎలా ప్రభావితం చేసే అవకాశం ఉంది తదితర అంశాలన్నీటినీ ఆయా రంగాల నిపుణులు ఈ సదస్సులో విశ్లేషిస్తారు.
వీడియో ఎంటర్టైన్మెంట్ ధర పెరుగుదల, వ్యాపార, ఆదాయ నమూనాలలో మార్పులు, వాల్యూ యాడేడ్ సేవలు, కరోనా సంక్షోభం తరువాత మళ్ళీ మామూలు పరిస్థితికి చేరుకోవటం లాంటి అంశాలమీద నిపుణులు ప్రసంగిస్తారు. 5 జి వలన ఎదురయ్యే సవాళ్ళ గురించి, కేబుల్ టీవీ టెక్నాలజీ గురించి , పంపిణీ వేదికల సమస్యల గురించి ఓటీటీ విస్తరణ ప్రభావం గురించి చర్చ జరుగుతుంది. భారత వినియోగదారుణ్ణి సంతృప్తి పరచటమెలా అనే విషయం మీద చారచ్చతో ఈ సదస్సు ముగుస్తుంది.
ఈ మొత్తం కార్యక్రమం ఇండియన్ టెలివిజన్ డాట్ కామ్ వారి సోషల్ మీడియా వేదికలమీద లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here