ఓటీటీల సెన్సార్ కి సిద్ధమైన యుకె: భారత్ సంగతేంటి?

0
378

థియేటర్లలో విడుదలయ్యే సినిమాలను సెన్సార్ చేయటం చాలా ఆకాలంగా అమలులో ఉన్న విషయమే. ఆ తరువాత టీవీలలో ప్రసారమయ్యే సినిమాల మీద కూడా ఆంక్షలు పెట్టారు. థియేటర్ల సెన్సార్ కు భిన్నంగా మరిన్ని కఠిన ఆంక్షలతో టీవీలలో ప్రసారానికి అనుమతిస్తున్నారు. అయితే, ఇప్పటి ఓటీటీల మీద సెన్సార్ లేకపోవటంతో కంటెంట్ తయారీదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం చూసీ చూడనట్టు వదిలేయటం, అది క్రియేటివిటీ అంటూ తప్పుకోవటం మీద దేశమంతటా నిరసన గళాలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇంతకీ, సినిమాలకు ఉండే సెన్సార్ షిప్ ను ఓటీటీలకు కూడా వర్తింపజేయాలా అన్నదే ఇప్పుడున్న ప్రధాన సమస్య. సినిమాలు సెన్సార్ అయ్యాక మాత్రమే విడుదల కావటం ఆనవాయితీ కాగా, ఓటీటీ ప్రసారాలు మాత్రం నేరుగా ఓటీటీ వేదికలమీద విడుదల చేయటం వలన సెన్సార్ ప్రక్రియ నుంచి తప్పించుకుంటున్నాయి. ఆ విధంగా అవి తాము చూపదలచుకున్న కంటెంట్ ను తమ ఇష్టమొచ్చిన విధంగా డిజిటల్ వేదికలమీద చూపటానికి చట్టపరంగా ఎలాంటి అవరోధాలూ లేవు. అయితే, ఈ మధ్యనే కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, ఓటీటీ వేదికలను సెన్సార్ పరిధిలోకి తెచ్చే ఆలోచన ఉందని చెప్పారు.
ఇలా ఉండగా యు.కె. ప్రభుత్వం దీన్ని మాటలకు పరిమితం చేయకుండా ఆచరణలో పెట్టింది. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ లాంటి వేదికలను నిషేధించే దిశగా నిబంధనలు రూపొందించింది. నిజానికి ఈ విషయం ఎంతో కాలంగా పరిశీలనలో ఉన్నప్పటికీ ఇప్పుడు కఠినమైన నిర్ణయం తీసుకుంది. కొత్తగా రూపొందించిన మీడియా బిల్లు ప్రకారం ఏదైనా ఓటీటీ వేదిక అక్కడి నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో రెండున్నర లక్షల పౌండ్ల ( రూ. 2 కోట్ల 53 లక్షల 46 వేల 50 రూపాయల) జరిమానా విధించవచ్చు, లేదా యుకె లో ఆ ఓటీటీ ని నిషేధించవచ్చు. నిజానికి ప్రభుత్వ ప్రసార సంస్థకి దశాబ్దాల తరబడి ఈ నిబంధన వర్తింపజేస్తూనే ఉన్నారు.
ఈ నిబంధన వలన ఓటీటీ వేదికలు ఇకమీదట ఎట్టిపరిస్థితుల్లోనూ యూ కే నిబంధనలను అతిక్రమించి ప్రసారాలు రూపొందించటానికి వీల్లేదు. ఇలా బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేస్తుండగా భారతదేశంలో కూడా ఎంతోకాలంగా ప్రజలు కోరుకుంటున్న సెన్సార్ ను అమలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే సెక్స్ పాలు మరీ ఎక్కువైందన్న విమర్శలు ఎదుర్కుంటున్న ఓటీటీ గాడిలో పడటానికి సెన్సార్ ఒక్కటే మార్గమని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటిదాకా స్వీయ నియంత్రణ పేరుతో చూసీ చూడనట్టు వదిలేసిన ప్రభుత్వం మీద ఇప్పుడు సెన్సార్ కోసం వత్తిడి బాగా పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here