టీవీ9 నెట్ వర్క్ ఆధ్వర్యంలో కొత్త డిజిటల్ వీడియో మాగజైన్ వేదిక

0
741

కొత్త డిజిటల్ వీడియో మాగజైన్ వేదిక రూపకల్పనలో టీవీ 9 వేగంగా అడుగులు వేస్తోంది. వార్తల ఆధారిత కంటెంట్ ను అందించే ఇంగ్లీష్ వేదిక ఇది. డిసెంబర్ లో బీటా వెర్షన్ ప్రారంభించి, వచ్చే జనవరిలో లాంఛనంగా ఈ వేదికను ప్రారంభిస్తారని తెలుస్తోంది. జనం తమకు కావాల్సిన కంటెంట్ తమకు వీలున్న సమయంలో ఎంచుకొని చూసేలా ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీసుల తరహాలోనే ఈ డిజిటల్ వేదిక ఉంటుంది. వార్తల ఆధారిత సమాచారాన్ని విశ్లేషణాత్మకంగా మాగజైన్ తరహా కథనంతోనూ, ఓటీటీ తరహా డిజిటల్ వీడియో నాణ్యతతోనూ అందించటం దీని ప్రత్యేకత.
వార్తల ఆధారంగా రూపొందించినా ఈ ప్రసారాలకు దీర్ఘకాల విలువ ఉండేలా రూపొందిస్తారు. వార్తకు ఉండే భిన్నమైన కోణాలను స్పృశిస్తూ సాగుతుంది. ఇంతకుముందు బెంగళూరు కేంద్రంగా టీవీ9 నెట్ వర్క్ వారి ఇంగ్లీష్ చానల్ గా గుర్తింపు పొందిన న్యూస్ 9 ఇప్పుడు ఈ వేదికకు చిరునామా. ఇప్పటికే న్యూస్9 పేరుతో ఒక వెబ్ సైట్ కూడా ప్రారంభించగా ఇప్పుడు ఆ పేరును వాడుకుంటున్నప్పటికీ వాటి మధ్య ఎలాంటి సంబంధమూ లేదు. బాగా ప్రజాదరణ పొందే మాధ్యమం వీడియో అయితే, ఆలా జరిగేది డిజిటల్ లోనే. అందుకే న్యూస్ 9 ఈ రూపంలో పునరుద్ధరణ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here