ఐపిఎల్ లో టీవీ9 లోగో ధరించబోతున్న రాజస్థాన్ రాయల్స్

0
454

టీవీ9 గ్రూపు హిందీ చానల్ భరత వర్ష్ లో ఈసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగే ఐపిఎల్ 13వ ఎడిషన్ లో రాజస్థాన్ రాయల్స్ ధరించే జెర్సీలమీద ప్రత్యక్షం కాబోతున్నది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఈ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జట్టు ధరించే జెర్సీల ముందు భాగంలో టీవీ 9 లోగో ఉంటుంది
2020 లోనే జరగాల్సి ఉన్న ఐపిఎల్, కోవిడ్ సంక్షోభం కారణంగా వాయిదా పడింది. ఈ మెగా ఈవెంట్ ను మొదట ఎక్స్ పో 2020 దుబాయ్ స్పాన్సర్ చేయాల్సి ఉండగా దాని స్థానంలో ఇప్పుడు టీవీ9 వచ్చి చేరింది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు రాబోయే సీజన్ లో టీవీ 9 ప్రేక్షకులకు అద్భుతమైన కార్యక్రమాన్ని అందించబోతున్నారు. ఒక బలమైన బ్రాంద్ వచ్చి చేరటం పట్ల రాజస్థాన్ రాయల్స్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ ఒప్పందం కుదర్చటంలో అలయెన్స్ అడ్వర్టయిజింగ్ వ్యవస్థాపకుడు అర్షద్ షాల్ కీలకపాత్ర పోషించారు. టీవీ9 ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలో బలమైన ముద్ర వేయగా అందులో మూడు రాష్ట్రాల జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఇప్పుడు జాతీయ స్థాయిలో రెండో స్థానానికి ఎగబాకిన భరత్ వర్ష్ తోడయింది. రాజస్థాన్ రాయల్స్ తో అనుబంధం వలన జాతీయ స్థాయిలో ఈ గ్రూప్ చానల్స్ బలమైన ముద్ర వేస్తాయని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here