సిబిఐ చేతుల్లోకి రేటింగ్స్ కేసు

0
471

ప్రేక్షకాదరణ లెక్కించి చెప్పే రేటింగ్స్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు పోలీస్ కేసుల పరిధి దాటి ఇప్పుడు సిబిఐ చేతుల్లోకి వెళ్లాయి. ఒకవైపు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో మొదలైన కేసు ఆ తరువాత ఉత్తరప్రదేశ్ లో తేలటంతో ఇది రాజకీయ పార్టీలమధ్య  వ్యవహారంగా తయారైంది. న్యూస్ చానల్స్ కు రాజకీయ అండదండలుండటం కొత్త కాకపోయినా, ఇప్పుడు రేటింగ్స్ దాక్ఆ వెళ్ళి ఆ తరువాత సిబికి కి అప్పగించే స్థాయికి వెళ్ళటం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.

టీవీ న్యూస్ పరిశ్రమను సరైన గాడిలో పెట్టటానికి బదులు ప్రభుత్వ సంస్థల జోక్యంతో టీవీ పరిశ్రమ సొంతగా పెట్టుకున్న రేటింగ్స్ ఏజెన్సీని బజారుకీడ్చటంతో పరిశ్రమ సైతం గ్రూపులుగా చీలిపోయింది. రేటింగ్స్ శాంపిల్ ఇళ్లవివరాలు బైటికి వచ్చి కొంతమంది తమకు అనుకూలంగా వాడుకుంటున్నారనేది అసలు ఫిర్యాదు. నిజానికి బార్క్ గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరిపించటంతోబాటు అలామ్టి అవకాశాలు లేకుండా మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడది చేతులు దాటిపోయింది.

ముంబయ్ పోలీసులు కేసు నమోదు చేయటంలో సమస్య మొదలుకాగా స్వయంగా ముంబయ్ పోలీస్ కమిషనర్ విచారణలోకి దిగటంతో దీని స్థాయి పెరిగింది, న్యూస్ చానల్స్ పరస్పరం దూషించుకోవటం మొదలైంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక చానల్ మీద వేధింపు చర్యలు ప్రారంభించంది అని ఆరోపించగానే ఉత్తరప్రదేశ్ లో ఒక చిన్న యాడ్ ఏజెన్సీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారన ప్రారంభించటం, కేసును సిబిఐకి అప్పగించటం చకచకా జరిగిపోయాయి.

ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశముంది. సిబిఐ విచారణ కారణంగా బార్క్ లెక్కింపు ఆగిపొయినా ఆశ్చర్యం లేదు. అలాంటప్పుడు యాడ్ ఏజెన్సీలకు ఆధారం అంటూ ఉండదు. మరోవైపు సిబిఐ విచారణ ఆధారంగా ప్రభుత్వమే రేటింగ్స్ లెక్కింపు బాధ్యత తీసుకోవటానికి వెనకాడకపోవచ్చు. ఇందులో తాజకీయాలు చొరబడటం మంచిది కాదు. పరిశ్రమ ఇప్పుడు ఉలిక్కిపడింది గాని ఇప్పటికే చేతులు కాలాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here