స్టార్ ను హెచ్చరిస్తూ ట్రాయ్ ఘాటు లేఖ

0
499

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఈరోజు స్టార్ ఇండియా లిమిటెడ్ ను హెచ్చరిస్తూ ఘాటైన లేఖ రాసింది. ఈ ఏడాది జనవరి 1న జారీచేసిన టారిఫ్ ఆర్డర్ కు అనుగుణంగా ఇంటర్ కనెక్షన్ ఒప్పందాలు చేసుకోవటమో లేదా పాత ఒప్పందాలు కొనసాగించటమో తేల్చుకోవాలని ఆదేశించింది. పాత ఒప్పందాలను పాత నిబంధనలమేరకు కొనసాగించాలే తప్ప రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ నిబంధనలమీద సంతకాలు చేయాల్సిందిగా పంపిణీ సంస్థలమీద వత్తిడి చేయటం తగదని హెచ్చరించింది. స్టార్ నుంచి వస్తున్న లేఖల ఆధారంగా పలు పంపిణీ సంస్థలు చేసిన ఫిర్యాదుల మీద ట్రాయ్ స్పందించింది.
టారిఫ్ ఆర్డర్ సవరిస్తూ ట్రాయ్ ఈ ఏడాది జనవరి 1 న కొత్త టారిఫ్ ఆర్డర్ ఎన్టీవో 2.0 ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొందరు బ్రాడ్ కాస్టర్లు ఈ టారిఫ్ ఆర్డర్ అమలును అడ్డుకుంటూ బొంబాయి హైకోర్టులో సవాలు చేశారు. కొత్త టారిఫ్ అర్డర్ అమలును కోర్టు నిలిపివేయనప్పటికీ, విషయం కోర్టులో ఉన్నందున తాము బ్రాడ్ కాస్టర్లమీద ఎలాంటి వత్తిళ్ళకూ పాల్పడలేదని ట్రాయ్ ఆ లేఖలో స్పష్టం చేసింది.
ఈ లోపు ట్రాయ్ కి పలు పంపిణీ సంస్థలు స్టార్ మీద ఫిర్యాదు చేసాయి. కొత్త టారిఫ్ ఆర్డర్ 2.0 కు అనుగుణంగా లేని రిఫరెన్స్ ఇంటర్ కనెక్షన్ ఆఫర్ మీద సంతకాలు చేయాల్సిందిగా స్టార్ లేఖలు రాస్తోందని ఫిర్యాదు చేశాయి. కొత్త నిబంధన అమలు మీద అన్నీ ఆగిపోయినప్పుడు స్టార్ ఇలాంటి చర్యకు పూనుకోవటం అర్థం లేనిదని ట్రాయ్ అభిప్రాయపడుతోంది. పాతవి కొనసాగించటం, లేదా కొత్తవైతే కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండాలని తేల్చి చెబుతూ స్టార్ కి లేఖ రాసింది.
అందువలన కోర్టు తీర్పు వెలువడేదాకా స్టార్ ఇండియా సంస్థ 01.01.2020 కి ముందునాటి పరిస్థితిని యథాతథంగా కొనసాగించాల్సి ఉంటుందని. పాత రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని, లేని పక్షంలో కొత్త నిబంధనలతో మాత్రమే కొత్త ఆర్ ఐ ఒ మీద సంతకాలు కోరవచ్చునని చెప్పింది. దీనికి కట్టుబడుతున్నట్టు నిర్థారిస్తూ ఈనెల 30 లోగా ట్రాయ్ కి తెలియజేయాలని కూడా ఈ లేఖలో స్టార్ ని కోరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here