టీవీ రంగంలో ‘స్థానిక తయారీ’ మీద ట్రాయ్ సిఫార్సులు

0
1145

టీవీ రంగానికి సంబంధించిన ఉత్పత్తులన్నీ స్థానికంగా తయారు చేసుకోవటాన్ని ప్రోత్సహించే దిశలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) తాజాగా కొన్ని సిఫార్సులు చేసింది. ట్రాయ్ కార్యదర్శి రఘునందన్ పేరిట జారీ అయిన 68 పేజీల డాక్యుమెంట్ ను కేబుల్ సమాచారమ్ పాఠకుల కోసం ఇక్కడ సంక్షిప్తంగా ఇస్తున్నాం. పూర్తి డాక్యుమెంట్ చూడాలనుకునేవారు ఈ లింక్ క్లిక్ చేయాలి: https://trai.gov.in/sites/default/files/Recommendations_31032023_0.pdf
భారతదేశంలో 2012 లో మొదలైన కేబుల్ టీవీ డిజిటైజేషన్ 2017 మార్చినాటికి పూర్తయింది. నిజానికి బాగా అభివృద్ధి చెందిన దేశాలలో కూడా పదేళ్ళు పట్టినా, సువిశాలమైన భారతదేశంలో ఐదేళ్లకే పూర్తయింది. ప్రజలమీద బలవంతంగా రుద్దిన డిజిటైజేషన్ ను అమలు చేయటానికి కేబుల్ రంగం ఎంతో కష్టపడింది. ఈ క్రమంలో మొదటిదశ హడావిడిలో సెట్ టాప్ బాక్సులను దిగుమతి చేసుకోక తప్పలేదు. ఆ తరువాత స్వదేశీ సెట్ టాప్ బాక్సుల తయారీ కూడా మొదలైంది. ఇటీవలే భారత ప్రభుత్వం మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా పథకాలు ప్రచారం చేస్తూ, భారతదేశాన్ని అంతర్జాతీయ డిజైనింగ్, తయారీ రంగాల కేంద్రంగా తయారుచేయాలని నిర్ణయించింది.
ఎక్విప్ మెంట్ తయారీలో భారతదేశ శక్తి సామర్థ్యాలను అంచనావేస్తూ, భారతీయ బ్రాడ్ కాస్టింగ్ రంగం దిగుమతుల నుంచి సొంత తయారీ దిశగా సాగేందుకు ప్రభుత్వానికి చేయాల్సిన సిఫార్సులను రూపొందించేందుకు 2021 డిసెంబర్ 22 న ట్రాయ్ ఒక చర్చా పత్రం జారీ చేసింది. సంబంధిత భాగస్వాముల నుంచి అందిన 16 సూచనలను ట్రాయ్ తన వెబ్ సైట్ లో పెట్టింది. ఆ తరువాత 2022 ఏప్రిల్ 28 న వీడియీ కాన్ఫరెన్స్ ద్వారా ఓపెన్ హౌస్ నిర్వహించి చర్చించింది.
అందరి నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత ట్రాయ్ ఈ సిఫార్సులను ఖరారు చేసింది:
a. ఈ కన్వర్జెన్స్ హయాంలో వస్తున్న అన్ని సాంకేతిక మార్పులనూ దృష్టిలో ఉంచుకుంటూ బ్రాడ్ కాస్ట్ రంగానికి తగిన పర్యావరణాన్ని రూపొందించుకోవాలి. బ్రాడ్ కాస్ట్ పరికరాల కోసం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నెలకొల్పటం, లేదా ఇప్పటికే ఉన్న టెలికాం ఎక్సలెన్స్ సెంటర్లను అప్ గ్రేడ్ చేయటం ద్వారా తయారీమీద దృష్టి సారించాలి.
b. స్థానికంగా తయారైన బ్రాడ్ కాస్ట్ పరికరాల ఎగుమతులను ప్రోత్సహించటానికి ‘టెలికాం ఎగుమతుల ప్రోత్సాహక మండలి’ తరహా సంస్థ వకాటు ఏర్పాటు చేయాలి.
c. టెలికమ్యూనికేషన్ల డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో టెలికాం ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయటం ద్వారా అన్నీ రకాల బ్రాడ్ కాస్టింగ్ పరికరాలను టెస్ట్ చేసి ప్రామాణీకరించాలి.
d. ప్రభుత్వ రంగంలోని సి-డాట్ లాంటి సంస్థల్లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను బలోపేతం చేయటానికి బ్రాడ్ కాస్టింగ్ పరిశ్రమను కూడా వాడుకుంటూ పిపిపి మార్గంలో స్థానిక ఆర్ అండ్ డి వ్యవస్థను తీర్చిదిద్దటం అవసరం. టెక్నాలజీ డెవలప్ మెంట్ ఫండ్ ఏర్పాటు చేయటం ద్వారా బ్రాడ్ కాస్టింగ్ లో స్థానిక ఉత్పత్తుల ఆర్ అండ్ డి ని ప్రోత్సహించటం, స్థానిక కాస్ వాడకానికి ప్రోత్సాహాలివ్వటం అలాంటి చర్యల ఫలితాలను సమీక్షించటం ద్వారా ప్రామాణీకరించటం అవసరమని గుర్తించాలి.
e. స్థానిక ఆర్ అండ్ డి ద్వారా తయారు చేసిన ఉత్పత్తులను మార్కెట్ కు పంపే వ్యూహం కూడా అమలు చేయాలి.
f. లీనియర్ సెట్ టాప్ బాక్సుల తయారీని కూడా ఉత్పత్తి తో అనుసంధానమైన ప్రోత్సాహకాల పరిధిలోకి తేవాలి.
g. చీప్ సెట్స్ సహా బ్రాడ్ కాస్టింగ్ పరికరాల తయారీకి అవసరమయ్యే విడి భాగాల అందుబాటు మీద క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్ష జరగాలి. స్థానికంగా అందుబాటులో ఉండే విడి భాగాలను లెక్కలోకి తీసుకుంటూ పీఎల్ఐ పథకం కిందికి స్థానిక తయారీ యూనిట్లను తీసుకురావాలి. ఎంపిక చేసిన పరికరాల తయారీ యూనిట్లను ఎం ఎస్ ఏం ఇ పరిధిలోకి తీసుకువచ్చి పి ఎల్ ఐ పథకాన్ని వర్తింపజేసేలా పెట్టుబడి పరిమితులను ఎప్పటికప్పుడు పునస్సమీక్షించాలి.
సిఫార్సుల పూర్తి పాఠం ట్రాయ్ వెబ్ సైట్ www.trai.gov.in లో అందుబాటులో ఉంది. ఏదైనా సమాచారం గాని, వివరణ గాని కావాలంటే శ్రీ అనిల్ కుమార్ భరద్వాజ్, సలహాదారుడు (బి అండ్ సీఎస్) ను +91-11-23237922 నెంబర్ లో సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here