బ్రాడ్ బాండ్ వ్యాపారంలో ఆపరేటర్లకు అనుకూల సిఫార్సులు చేసిన ట్రాయ్

0
1107

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) బ్రాడ్ బాండ్ వ్యాప్తికి అనుకూలంగా కొన్ని కీలకమైన సిఫార్సులు చేసింది. ఇప్పటికే బ్రాడ్ బాండ్ ద్వారా ఆదాయం పెంచుకోవాలని ఆలోచిస్తున్న కేబుల్ రంగానికి ఈ సిఫార్సులు అతి పెద్ద వరాలనే చెప్పాలి. ముందుగా ఒక చర్చా ప్రెరం విడుదల చేసి అభిప్రాయాలు సేకరించటంతో బాటు ఓపెన్ హౌస్ నిర్వహించి బాగోగులు చర్చించిన మీదట ట్రాయ్ ఈ సిఫార్సులు చేసింది. ఈ మేరకు నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది.

కనీస బ్రాడ్ బాండ్ స్పీడ్ ను ట్రాయ్ ఈ సందర్భంగా నిర్వచించింది. ఇది కనీసం 2 ఎంబీపీఎస్ ఉండాలని స్పష్టం చేసింది.అదే విధంగా బ్రాడ్ బాండ్ ను వర్గీకరించింది.
బేసిక్ లో కనీసం 2 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ స్పీడ్, ఫాస్ట్ లో కనీసం 50 ఎంబీపీఎస్, సూపర్ ఫాస్ట్ లో కనీసం 300 ఎంబీపీఎస్ ఉండాలని సూచించింది.

లైసెన్స్ ఫీజుకు లెక్కించే వార్షిక స్థూల ఆదాయాన్ని కేవలం బ్రాడ్ బాండ్ మీఫా వచ్చచె ఆదాయం మీదనే లెక్కించాలి తప్ప మొత్తం వ్యాపారం మీద ఉండకూడదని చెప్పింది.అంటే కేబుల్ వ్యాపారంలో ఉన్నవారు బ్రాడ్ బాండ్ వ్యాపారం కూడా చేస్తున్నప్పుడు వారి ఆదాయంలో కేబుల్ ఆదాయాన్ని వేరు చేసి, కేవలం బ్రాడ్ బంద్ ఆదాయం ఆధారంగానే లైసెన్స్ ఫీజు నిర్ణయించాలి. ఇది ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్లకు చాలా ప్రయోజనకరం.

అదే విధంగా కేబుల్ రంగంలో ఉన్నవారికి బ్రాడ్ బాండ్ కు సంబంధించిన సాంకేతిక నైపుణ్యం అవసరం గనుక కేబుల్ సిబ్బందికి, ఇతర నిరుద్యోగులకు కూడా ప్రభుత్వం ఉచిత నైపుణ్య శిక్షణ అందించటం అవసరమని ట్రాయ్ తన సిఫార్సులలో ప్రభుత్వానికి సూచించింది. అదే విధంగా బ్రాడ్ బాండ్ లోకి దిగాలనుకునేవారు సూక్ష్మ, చిన్న తరహా వ్యాపార సంస్థలుగా నమోదు చేసుకుంటే వారికి వడ్డీ లేని, లేదా తక్కువ వడ్డీతో ఋణాలిచ్చే సౌకర్యం వర్తింపజేయాలని కోరింది. అదే విధంగా ఆర్ ఓ డబ్ల్యు కోసం ఒక జాతీయ పోర్టల్ ఏర్పాటు చేసి, అందులో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తే కేబుల్స్ వేసుకోవటానికి సులభంగా అనుమతులు లభించటం, పారదర్శకంగా అనుమతులు రావటం మేలు చేస్తుందని కూడా ట్రాయ్ సిఫార్సు చేసింది. దీనివల్ల ఆపరేటర్లు విద్యుత్ స్తంభాల వాడకానికి సులభంగా అనుమతులు పొందగలుగుతారు.
అదే సమయంలో ప్రభుతం శాశ్వతంగా డక్ట్ లు ఏర్పాటు చేసి కేబుల్స్ నడుపుకోవటానికి అవకాశమిస్తే కోత పడటానికి అవకాశం లేకపోవటంతోబాటు రోడ్లమీద కేబుల్స్ జారిపడటానికి, విద్యుత్ షాక్ నివారణకు పనికొస్తుందని ట్రాయ్ తన సిఫార్సులలో స్పష్టం చేసింది. ఉమ్మడిగా డక్ట్ లు ఏర్పాటు చేసుకునేవారికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని, అలాంటివారికి ఐదేళ్లపాటు ఆర్ఓ డబ్ల్యు చార్జీలు మినహాయింపు ఇవ్వాలని ట్రాయ్ సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here