కాస్, ఎస్ఎంఎస్ ధృవీకరణ బాధ్యతలు కొత్త ఏజెన్సీకి

0
604

టీవీ చానల్ పంపిణీ సంస్థల కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ (కాస్), సబ్ స్క్రయిబర్ మేమేజ్ మెంట్ సిస్టమ్ (ఎస్ ఎం ఎస్) ల పనితీరును పరీక్షించి, ధృవీకరించేందుకు ఒక కొత్త ఏజెన్సీ రంగ ప్రవేశం చేస్తోంది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈ మేరకు ఈ రోజు (సెప్టెంబర్ 20 న) కార్యదర్శి వి. రఘునందన్ పేరిట ఆదేశాలు జారీ చేసింది. డిజిటైజేషన్ లో భాగంగా కాస్, ఎస్ ఎం ఎస్ లు నిర్దేశించిన ప్రమాణాలలకు లోబడి ఉండాల్సిందేనని నిబంధనలలో స్పష్టం చేయటాన్ని ట్రాయ్ గుర్తు చేసింది. టెలికమ్యూనికేషన్ల విభాగానికి చెందిన టెలికామ్ ఇంజనీరింగ్ సెంటర్ ఇకమీదట టెస్టింగ్, సర్టిఫికేషన్ ఏజెన్సీ గా ఉంటుంది. ఈ ఆదేశాల ప్రకారం టెస్టింగ్, సర్టిఫికేషన్ ఏజెన్సీ గా టెలికామ్ ఇంజనీరింగ్ సెంటర్ చేపట్టే కార్యకలాపాలు ఇలా ఉంటాయి:

ఎ) ఇంటర్ కనెక్షన్ నిబంధనలకు అనుగుణంగా కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ (కాస్), సబ్ స్క్రయిబర్ మేమేజ్ మెంట్ సిస్టమ్ (ఎస్ ఎం ఎస్) లకు సంబంధించిన నిర్వహణ, సమన్వయం, పరీక్షించటం, ధృవీకరించటం

బి) అవసరానికి తగినట్టుగా పరీక్ష చేపట్టే తేదీలను, పరీక్ష చేసే విధానాలను ప్రకటించటం, వాటిని పాటించటం సి) నిర్ణీత పద్ధతులలో టెస్టింగ్ చేపట్టగలిగే సామర్థ్యం ఉన్న టెస్టింగ్ లాబ్ లను గుర్తించి వాటిని అక్రెడిటేషన్ పొందిన లాబ్ లుగా ఎంపానెల చేయటం డి) ఈ విధంగా అక్రెడిటేషన్ పొందిన లాబ్ లు పరీక్షించిన మీదట సర్టిఫికెట్ల జారీ

ఇ) భారత్ లో వాడుతున్న కాస్, ఎస్ ఎం ఎస్ వెర్షన్ ల జాబితా నిర్వహించటం నిజానికి డిజిటల్ హెడ్ ఎఁద్స్ ను పరీక్షిఁచి ధ్రువీకరణ పత్రాలిచ్చే బాధ్యతను ఇప్పటికీ బెసిల్ కు ఇచ్చిన సంగతి తెలిసిఁదే. ఇప్పుడు కీలకమైన సాఫ్ట్ వేర్ కు సైతం టెస్టిఁగ్, సర్టిఫికేషన్ వర్తింపజేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here