రాంకులు మారని తెలుగు చానల్స్

0
465

ఈ వారం కూడా న్యూస్ చానల్స్ రేటింగ్స్ లేకపోగా తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్ ర్యాంకులలో ఎలాంటి మార్పూ లేదు.స్టార్ మా తన మొదటి స్థానం కొనసాగిస్తూ ఉండగా దాదాపు ఒకటిన్నర దశాబ్ద కాలం తిరుగులేని నెంబర్ వన్ స్థానంలో ఉన్న జెమినీ టీవీ ప్రేక్షకాదరణ స్టార్ మా లో సగం కూడా లేకపోవటం చాలావారాలుగా కొనసాగుతూనే ఉంది. రెండో స్థానంలో జీ తెలుగు, మూడో స్థానంలో ఈటీవీ తెలుగు, నాలుగో స్థానంలో జెమిని కొనసాగుతున్నాయి.

బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్) ఈ ఏడాది 41 వ వారానికి గాను ( అక్టోబర్ 10 నుంచి 16 దాకా) లెక్కించిన సమాచారం ప్రకారం స్టార్ మా కు 78.16 కోట్ల వీక్షణలు రాగా, ఆ తరువాత స్థానాల్లో ఉన్న జీ తెలుగు (49.40 కోట్లు), ఈటీవీ తెలుగు(45.63 కోట్లు) జెమిని టీవీ  (34.53 కోట్లు) తెచ్చుకున్నాయి.

టాప్ 5 కార్యక్రమాల విషయానికొస్తే, స్టార్ మా ఆ జాబితాలో నాలుగు ర్యాంకులు సంపాదించుకుంది. స్టార్ మా సీరియల్స్ కార్తీక దీపం, ఇంటింటి గృహలక్ష్మి, వదినమ్మ దేవత వరుసగా 1,2,3,5 రాంకులు సంపాదించుకున్నాయి. జెమినీ టీవీలో ప్రసారమైన సరిలేరు నీకెవ్వరు సినిమా నాలుగో రాంకు సాధించుకుంది.

స్టార్ మా సీరియల్స్ కార్తీకదీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here