ప్రముఖ డీటీహెచ్ వేదిక టాటా స్కై పేరు మారబోతున్నదా? ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అనుబంధ సంస్థ అయిన టాటా స్కై లిమిటెడ్ పేరును టాటా ప్లే లిమిటెడ్ గా మార్చినట్టు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ రికార్డులలో నమోదైంది. అదే విధంగా టాటా ప్లే పేరుతో 2021 అక్టోబర్ 12న ట్రేడ్ మార్క్ రిజిస్టర్ కాగా, ఈ నెల 11 న లోగో కూడా రిజిస్టర్ అయింది.
మరీ ముఖ్యంగా గమనించాల్సిన విషయమేంటంటే, టాటా స్కై యాప్ సహా టాటా స్కై కి సంబంధించిన అనేక యాప్స్ కి యాజమాన్య సంస్థగా టాటా స్కై లిమిటెడ్ స్థానంలో టాటా ప్లే లిమిటెడ్ పేరు మార్చటం కూడా దీన్ని బలపరుస్తోంది. ఒకటీ, రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడవచ్చునని తెలుస్తోంది.
