2019లో అత్యధిక డిటిహెచ్ చందాదారులు టాటా స్కై లోనే, మొత్తంలో వాటా 31.80%

0
627

దూరదర్శన్ వారి ఉచిత డిటిహెచ్ డిడి ఫ్రీడిష్ ని మినహాయిస్తే భారతదేశంలో ఇప్పుడు మొత్తం 7కోట్లమంది డిటిహెచ్ చందాదారులున్నారు. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) వారి ఇండియన్ టెలికామ్ సర్వీసెస్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ రిపోర్ట్ అక్టోబర్-డిసెంబర్, 2019 ఈ సమాచారాన్ని వెల్లడించింది. 120 రోజులకు మించి చురుగ్గా లేని, తాత్కాలికంగా సస్పెండ్ చందాదారుల అయిన కనెక్షన్లు కూడా కలిసి ఉన్నాయి.

అయితే, బ్రాడ్ కాస్టింగ్ అండ్ కేబుల్ సర్వీసెస్ కొత్త నియంత్రణానిబంధనల ప్రకారం 90 రోజులకు మించి చురుగ్గా లేని కనెక్షన్లను కూడా పనిచేయనివిగానే భావించి లెక్కలోకి తీసుకోరు.

ఈ మొత్తం డిటిహెచ్ చందాదారులను నాలుగు డిటిహెచ్ సంస్థలు పంచుకుంటున్నాయి. ట్రాయ్ నివేదిక ప్రకారం అందులో టాటా స్కై చందాదారుల వాటా 31.80 శాతం కాగా, డిష్ టీవీ వాటా 30.55 శాతం, ఎయిర్ టెల్ డిజిటల్ టీవీ సర్వీసెస్ వాటా 23.31 శాతం, సన్ డైరెక్ట్ వాటా 14.35 శాతం. అంకెల్లో చెప్పాలంటే టాటా స్కై కి 2.23 కోట్లు, డిష్ టీవీకి 2.14 కోట్లు, ఎయిర్ టెల్ డిజిటల్ కి 1.63  కోట్లు, సన్ డైరెక్ట్ కి కోటి మంది చందాదారులున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here