మళ్ళీ జాతీయ స్థాయి మొదటి స్థానంలో సన్ టీవీ

0
461

జాతీయ స్థాయిలో సన్ టీవీ తన మొదటి స్థానాన్ని మళ్ళీ సాధించుకుంది. మే 7 తో ముగిసిన వారానికి బార్క్ అందజేసిన ప్రేక్షకాదరణ సమాచారం ప్రకారం స్టార్ మా కూడా తన నాలుగో స్థానానికి చేరుకోగా జీ తెలుగు తన తొమ్మిదో స్థానాన్ని కొనసాగిస్తోంది. ఆ విధంగా దక్షిణాది చానల్స్ లో టాప్ 10 లో ఒక తమిళ చానల్, రెండు తెలుగు చానల్స్ స్థానాలు పొందినట్టయింది. అయితే, జీ గ్రూప్ మొత్తంలో ఒక్క జీ తెలుగు మాత్రమే ఆలిండియా టాప్ 10 లో ఉండటం గమనార్హం. యాదృచ్ఛికంగా జీ తెలుగు ఈ నెల 18న తన 16 ఏళ్ళు నిండిన సందర్భంగా ప్రత్యేక ఉత్సవం జరుపుకుంటోంది.
తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ విషయానికొస్తే స్టార్ మా ( 2165.55), జీ తెలుగు (1564.47). ఈటీవీ తెలుగు (1248.83), జెమినీ టీవీ (741.97) వరుసగా నాలుగు స్థానాల్లో నిలిచాయి. జీ తెలుగు కంటే స్టార్ మా 38% ఎక్కువ కాగా ఈటీవీ తెలుగు కంటే 75% ఎక్కువ, జెమినీ టీవీ కంటే 188% ఎక్కువ. ఈటీవీ తెలుగు, జెమిని టీవీ కలిసినా మా టీవీ కంటే తక్కువే ఉండటం గమనార్హం.
కార్యక్రమాలలోనూ టాప్ 5 జాబితా మొత్తాన్ని స్టార్ మా సీరియల్సే ఆక్రమించాయి. తెలుగు సీరియల్స్ లో అత్యధిక ప్రేక్షకాదరణ ఉన్న కార్తీక దీపం (14043), దాని కంటే బాగా దిగువన ఉన్నా రెండో రాంకులో ఉన్న ఇంటింటి గృహలక్ష్మి (9543), ఆ తరువాత మూడో స్థానంలో ఉన్న గుప్పెడంత మనసు (8393), నాలుగో రాంకు సంపాదించుకున్న జానకి కలగనలేదు ( 6886), ఐదో స్థానంలో నిలిచిన దేవత ( 6803) కూడా స్టార్ మా సీరియల్సే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here