ఉమ్మడి భాగస్వామ్యంతో పరస్పరం ఎదుగుదాం: స్టార్ టీవీ

0
166

ఉమ్మడి భాగస్వామ్యంతో పరస్పరం ఎదుగుదామంటూ బ్రైట్ వే కమ్యూనికేషన్స్ ఎండీ శ్రీ సుభాష్ రెడ్డి కి స్టార్ టీవీ లేఖ రాసింది. వివో ఐపీఎల్ 2021 చివరి అంకానికి చేరుకున్న సందర్భంగా క్రికెట్ ప్రత్యక్షప్రసారాలను ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు చేర్చటంలో సహకరించాలని స్టార్, డిస్నీ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ టీవీ డిస్ట్రిబ్యూషన్ ప్రెసిడెంట్ శ్రీ గుర్జీవ్ సింగ్ కపూర్ ఆ లేఖలో శ్రీ సుభాష్ రెడ్డిని కోరారు. ఈ క్లిష్ట సమయంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కుంటూ సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

శ్రీ సుభాష్ రెడ్డితోనూ, ఆయన బృందంతోనూ కలసి పనిచేయటం ఆనందంగా ఉందని పేర్కొంటూ, ఈ భాగస్వామ్యం వలన ఏ అవరోధమూ పెద్దదిగా అనిపించదనీ, ఏ సవాలూ అసాధ్యం కాదని అన్నారు. “ఎంటర్టైన్మెంట్ తోనూ, క్రికెట్ ప్రత్యక్షప్రసారాలతోనూ ప్రేక్షకులను చేరుకునే మన కృషి ఇలాగే కొనసాగాలి. ఇప్పుడు మళ్ళీ వివో ఐపీఎల్ 2021 ముగింపు సీజన్ కోసం దేశ ప్రజలు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో మన భాగస్వామ్యం మరిన్ని అవకాశాలు కల్పించి పరస్పర ఎదుగుదలకు దోహదం చేయాలి” అని రాశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here