ఆలిండియా నెం. 1 స్టార్ మా

0
530

తాజా రేటింగ్స్ లో స్టార్ మా చానల్ ఆలిండియా నెంబర్ వన్ స్థానం సాధించుకుంది. బిగ్ బాస్ మీద వివాదాలతో సంబంధం లేకుండా దూసుకు పోవటంతో మాతృ సంస్థ స్టార్ ప్లస్ ను, ఇంతకుముందు నెంబర్ వన్ గా ఉన్న సన్ టీవీని వెనక్కు నెట్టి నెంబర్ వన్ పీఠం మీద నిలబడింది. తాజాగా సెప్టెంబర్ 4-10 తేదీల మధ్య వారానికి బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అందించిన సమాచారం ప్రకారం టాప్ టెన్ జాబితాలో స్టార్ మా మొదటి స్థానంలో ఉండగా స్టార్ ప్లస్ రెండో స్థానంలోనూ, సన్ టీవీ మూడో స్థానంలోనూ ఉన్నాయి. టాప్ టెన్ లో స్టార్ మా, స్టార్ ప్లస్, స్టార్ విజయ్, స్టార్ ఉత్సవ స్థానాలు దక్కించుకోవటంతో స్టార్ గ్రూప్ కి చెందిన రెండు జాతీయ చానల్స్, రెండు ప్రాంతీయ చానల్స్ ఈ జాబితాలో ఉన్నాయి.

కలర్స్ నాలుగో స్థానంలో ఉండగా సోనీ గ్రూప్ రెండు చానల్స్ కు స్థానం దక్కింది. అదే విధంగా జీ గ్రూప్ మెయిన్ చానల్స్ కు టాప్ టెన్ లో స్థానం దొరక్కపోయినా జీ తెలుగు(8), జీ కన్నడ (10) ఈవారం కూడా కొనసాగాయి.

తెలుగులో (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మార్కెట్లలో) స్టార్ మా (26.51), జీ తెలుగు (14.77), ఈటీవీ తెలుగు (14.07), జెమిని (9.43) లక్షల సగటు ప్రేక్షక నిమిషాలు సంపాదించుకున్నాయి. దీంతో స్టార్ మా మిగిలిన తెలుగు చానల్స్ కు అందనంత ఎత్తులో ఉన్నట్టు తేలిపోయింది. రెండవ స్థానంలో ఉన్న జీ తెలుగు ప్రేక్షకాదరణ స్టార్ మా ఆదరణలో సుమారు 55% ఉండగా ఈటీవీ వాటా 53%, జెమినీ టీవీ వాటా36% మాత్రమే ఉన్నాయి. ఎవరు మీలో కోటీశ్వరుడు, మాస్టర్ చెఫ్ లాంటి కార్యక్రమాలు సైతం జెమినీని పెద్దగా ఆదుకోలేకపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here