రేటింగ్స్ లో ‘స్టార్ మా’ తిరుగులేని ఆధిక్యం

0
507

తెలుగు చానల్స్ ప్రేక్షకాదరణలో స్టార్ మా తిరుగులేని ఆధిక్యం కొనసాగిస్తోంది. జాతీయ స్థాయిలో నెంబర్ టూ స్థానంలో ఉండటమే కాకుండా తెలుగులో మిగిలిన చానల్స్ కు అందనంత ఎత్తుకు చేరింది. తాజాగా ఆగస్టు 27 తో ముగిసిన 34 వ వారానికి బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్ ) విడుదల చేసిన సమాచారం ప్రకారం స్టార్ మా ( 24.21 లక్షలు), జీ తెలుగు (15.13 లక్షలు) ఈటీవీ తెలుగు ( 12.10 లక్షలు), జెమిని టీవీ (10.63 లక్షలు) సగటు ప్రేక్షక నిమిషాలు సంపాదించుకున్నాయి.
ఇందులో జీ తెలుగు ఆదరణ స్టార్ మా తో పోల్చుకున్నప్పుడు మూడింట రెండొంతుల కంటే తక్కువ ఉండగా ఈ టీవీ తెలుగుకు ఉన్న ఆదరణ స్టార్ మా టీవీలో సగం కంటే తక్కువుంది. జెమినీ వాటా మా టీవీలో 45% కంటే తక్కువ నమోదైంది. జెమినీలో ప్రారంభమైన మీలో ఎవరు కోటీశ్వరులు, మాస్టర్ చెఫ్ లాంటి కొత్త కార్యక్రమాల ప్రభావం వచ్చే వారానికి గాని పూర్తిస్థాయిలో కనిపించటం మొదలుకాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here