జాతీయ స్థాయిలో మూడో స్థానంలో స్టార్ మా

0
469

టీవీ ప్రేక్షకాదరణను లెక్కించే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం జాతీయ స్థాయిలో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న చానల్స్ జాబితాలో స్టార్ మా కు మూడో స్థానం దక్కింది. స్టార్ ప్లస్ కు మొదటి స్థానం రాగా సన్ టీవీ ది రెండో స్థానం. జూన్ 18 తో ముగిసిన వారానికి బార్క్ తాజా సమాచారం విడుదల చేసింది.
ఇంతకు ముందు విడుదలచేసే పద్ధతిలో కొంత మార్పు చేస్తూ భాష ప్రతిపదికన మార్కెట్లను విభజించి మరింత సమగ్రంగా డేటా అందిస్తున్న బార్క్ కార్యక్రమాల వారీగా రాంకులు ప్రకటించటం నిలిపేసింది. చానల్స్ కు మాత్రమే అలాంటి సమాచారాన్ని అందిస్తూ, స్థూల వివరాలను మాత్రమే సభ్యులు కానివారికోసం అందుబాటులో ఉంచుతోంది.
జాతీయ స్థాయి టాప్ 10 చానల్స్ మూడు, నాలుగు స్థానాలు సన్ టీవీ ( తమిళం) స్టార్ మా ( తెలుగు ) దక్కించుకోగా, స్టార్ విజయ్ ( తమిళం – ఏడో ర్యాంకు), జీ తెలుగు (తెలుగు-తొమ్మిదో ర్యాంకు) సంపాదించుకున్నాయి. దీంతో టాప్ 10 లో రెండు తమిళ, రెండు తెలుగు చానల్స్ దక్కించుకున్నట్టయింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here