జాతీయ స్థాయిలో 5వ స్థానానికి పడిపోయిన స్టార్ మా

0
528

స్టార్ స్పోర్ట్స్ దూసుకు రావటంతో ఏప్రిల్ 30 తో ముగిసిన వారానికి బార్క్ అందించిన రేటింగ్స్ సమాచారం ప్రకారం ఆ చానల్ జాతీయ స్థాయిలో మొదటి రాంకు దక్కించుకుంది. అదే సమయంలో అంతకుముందు కాస్త కిందికి జారిన సన్ టీవీ మళ్లీ కోలుకోవటంతో స్టార్ మా తన మూడో స్థానం నుంచి వెనక్కి తిరిగి ఐదో రాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జీ తెలుగు ఈవారం కూడా టాప్ 10 లో స్థానాన్ని కొనసాగిస్తూ వచ్చింది.
తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ తాజా రేటింగ్స్ లో ఎప్పటిలాగానే నూ స్టార్ మా తన తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంటూ వచ్చింది. రాంకులలో కూడా మార్పేమీ లేదు. స్టార్ మా (2113) తిరుగులేని నెంబర్ వన్ స్థానం కొన సాగిస్తుండగా జీ తెలుగు (1556) రెండో స్థానంలోను, ఈటీవీ తెలుగు (1197) మూడో స్థానంలోను, జెమినీ టీవీ (797) నాలుగో స్థానంలోనూ ఉన్నాయి. ఈటీవీ, జెమినీ కలిసినా స్టార్ మా కంటే తక్కువే ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న జీ తెలుగు మీద సైతం స్టార్ మా దాదాపు 40 శాతం అధికంగా ప్రేక్షకాదరణ పొందటం గమనార్హం.
ఇక కార్యక్రమాల విషయానికొస్తే టాప్ 5 లో మొత్తం ఐదు స్థానాలూ స్టార్ మా సీరియల్స్ దక్కించుకున్నాయి. కార్యక్రమాల్లో స్టార్ మా వారి కార్తీక దీపం (13997) మొదటి రాంక్, ఇంటింటి గృహలక్ష్మి (9251) రెండో రాంక్, గుప్పెడంత మనసు (8256) మూడో రాంక్, దేవత (6883) నాలుగో స్థానం, జానకి కలగనలేదు (6074) ఐదో స్థానం సంపాదించుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here