తెలుగు చానల్స్ లో కొనసాగుతున్న స్టార్ మా ఆధిక్యం

0
686

తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో స్టార్ మా ఆధిక్యం కొనసాగుతూ ఉంది. బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అందించిన తాజా సమాచారం ( అక్టోబర్ 17-23 మధ్య కాలం) ప్రకారం నాలుగు చానల్స్ రాంకులలో ఎలాంటి మార్పులూ లేవు. ఈటీవీ తెలుగు, జెమినీ టీవీ ప్రేక్షకాదరణ కలిపినా స్టార్ మా కంటే తక్కువే ఉండటం విశేషం. స్టార్ మా చానల్స్ కు వారానికి వచ్చిన మొత్తం వీక్షణలు 786282 వేలు కాగా, జీ తెలుగు (492921 వేలు), ఈటీవీ తెలుగు ( 461580 వేలు), జెమినీ టీవీ (311517 వేలు) సంపాదించుకున్నాయి.

కార్యక్రమాల విషయానికొస్తే, స్టార్ మా మొదటి ఐదు స్లాట్స్ ను సొంతం చేసుకుంది. కార్తీక దీపం (15229 వేలు), ఇంటింటి గృహలక్ష్మి (11592 వేలు) వదినమ్మ (10821 వేలు),  దేవత (7646 వేలు), చెల్లెలికాపురం (7037 వేలు) అదే వరుసలో రాంకులు సంపాదించుకున్నాయి. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయమేంటంటే టాప్ 5 కార్యక్రమాల్లో బిగ్ బాస్ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here