రేటింగ్స్ లో తిరుగులేని స్టార్ మా

0
617

తెలుగు టీవీ చానల్స్ తాజా రేటింగ్స్ లోనూ స్టార్ మా తన తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంటూ వచ్చింది. రాంకులలో కూడా మార్పేమీ లేదు. స్టార్ మా (2202) తిరుగులేని నెంబర్ వన్ స్థానం కొన సాగిస్తుండగా జీ తెలుగు (1583) రెండో స్థానంలోను, ఈటీవీ తెలుగు (1197) మూడో స్థానంలోను, జెమినీ టీవీ (783) నాలుగో స్థానంలోనూ ఉన్నాయి. ఈటీవీ, జెమినీ కలిసినా స్టార్ మా కంటే 10 శాతం తక్కువే ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న జీ తెలుగు సైతం స్టార్ మాకంటే 28 శాతం తక్కువ ప్రేక్షకాదరణ పొందటం గమనార్హం.
ఇక కార్యక్రమాల విషయానికొస్తే టాప్ 5 లో మొత్తం ఐదు స్థానాలూ స్టార్ మా సీరియల్స్ దక్కించుకున్నాయి. కార్యక్రమాల్లో స్టార్ మా వారి కార్తీక దీపం (14135) మొదటి రాంక్, ఇంటింటి గృహలక్ష్మి (10238) రెండో రాంక్, దేవత (8540) మూడో రాంక్, గుప్పెడంత మనసు (7258) నాలుగో స్థానం, జానకి కలగనలేదు (7104) ఐదో స్థానం సంపాదించుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here