తిరుగులేని నెం.1 స్థానంలో స్టార్ మా

0
638

తెలుగు టీవీ చానల్స్ తాజా రేటింగ్స్ లోనూ చెప్పుకోదగ్గ మార్పేమీ కనబడలేదు. స్టార్ మా (2134) తిరుగులేని నెంబర్ వన్ స్థానం కొన సాగిస్తుండగా జీ తెలుగు (1478) రెండో స్థానంలోను, ఈటీవీ తెలుగు (1199) మూడో స్థానంలోను, జెమినీ టీవీ (773) నాలుగో స్థానంలోనూ ఉన్నాయి. కార్యక్రమాల విషయానికొస్తే టాప్ 5 లో అన్ని స్థానాలూ స్టార్ మా సీరియల్స్ దక్కించుకోగా ఇంతకుముందు ఐదవ స్థానంలో ఉంటూ వచ్చిన జీ తెలుగు వారి ప్రేమ ఎంత మధురం రాంకు పడిపోయింది. కార్యక్రమాల్లో స్టార్ మా వారి కార్తీక దీపం (13152) మొదటి రాంక్, ఇంటింటి గృహలక్ష్మి (10332) రెండో రాంక్, దేవత (8726) మూడో రాంక్, జానకి కలగనలేదు (7379) నాలుగో స్థానం, గుప్పెడంత మనసు (7371) ఐదవ స్థానం సంపాదించుకున్నాయి.
ర్యాంకు చానల్ కార్యక్రమం వారపు సగటు
వీక్షణలు (వేలల్లో)
1 స్టార్ మా కార్తీక దీపం 13152
2 స్టార్ మా ఇంటింటి గృహలక్ష్మి 10332
3 స్టార్ మా దేవత 8726
4 స్టార్ మా జానకి కలగనలేదు 7379
5 స్టార్ మా గుప్పెడంత మనసు 7371

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here