క్రికెట్ సౌతాఫ్రికా హక్కులు దక్కించుకున్న స్టార్

0
437

క్రికెట్ సౌతాఫ్రికా (సిఎస్ఎ) మీడియా హక్కులు దక్కించుకోవటం ద్వారా స్టార్ ఇండియా తన బలం మరింత పెంచుకుంది. 2023-24 సీజన్ ముగింపు దాకా ఈ హక్కులు స్టార్ కే చెందుతాయి. ఈ ఒప్పందం ద్వారా స్టార్ ఆసియా, పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలలో టీవీ, డిజిటల్ మాధ్యమాలలో ప్రసారం చేసుకునే హక్కు దక్కించుకున్నట్టయింది. ఈ ఒప్పంద కాలంలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన కూడా చేరి ఉంటుంది. ఇది నవంబర్ 27 న మొదలయ్యే ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనతో మొదలవుతుంది. ఐపిఎల్ తరువాత మళ్లీ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో క్రికెట్ పునఃప్రారంభానికి ఇది సంకేతం.
స్టార్ ఇండియాకు ఇప్పటికే ఐసిసి, బిసిసిఐ క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సహా అనేక క్రికెట్ పోటీల అంతర్జాతీయ ప్రసార హక్కులున్నాయి. కొన్నేళ్ళుగా క్రీడాభిమానులను ఆకట్టుకునేదిశలో అనేక ఇతర కార్యక్రమాలు కూడా ప్రసారం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డ్రీమ్ 11 ఐపిఎల్ ను కూడా నిర్మించింది. ఇప్పుడు నవంబర్ 27 నుంచి జరిగే ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు టి20 లు మొదటి సారిగా హిందీలో కూడా ప్రసారమవుతాయి. దీనివలన హిందీ మాట్లాడే మార్కెట్లలో మరింతగా చొచ్చుకుపోయే అవకాశం ఉంటుందని స్టార్ అంచనా వేస్తోంది.
ఈ ఒప్పందం ప్రకారం దక్షిణాఫ్రికా పురుషుల జట్టు ఆడే అన్ని అంతర్జాతీయ మాచ్ లూ స్టార్ కే చెందుతాయి. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం దక్షిణాఫ్రికా జట్టు స్వదేశంలో మొత్తం 59 మాచ్ లు ఆడుతుంది. ఇందులో పేరుమోసిన భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగే సిరీస్ కూడా ఉంటాయి. ఈ ఒప్పంద కాలంలోనే భారత జట్టు మూడు విడతలు దక్షిణాఫ్రికా పర్యటించవలసి ఉండటం వలన ఈ రెండు జట్లు 20 మాచ్ లు ఆడతాయని తెలుస్తోంది. 2012-22 లో మొదలైనప్పుడు ఇందులో మూడు టెస్ట్ మ్యాచ్ లు, మూడు టి20 లు ఉంటాయి. మొమెంటమ్ ప్రొటియాస్ ఆడే మహిళల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు కూడా ఈ ఒప్పందం పరిధిలోకి వస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here