ఇంకా తేలని న్యూస్ రేటింగ్స్ వ్యవహారం

0
510

టీవీ ప్రేక్షకాదరణ లెక్కించే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) రేటింగ్స్ ఇవ్వటం ఆపేసి మూడు నెలలు కావస్తున్నా, ఇంకా పునరుద్ధరించలేదు. రేటింగ్స్ లో అవకతవకల గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాత్కాలికంగా న్యూస్ చానల్స్ కు మాత్రం రేటింగ్స్ వెల్లడించటం నిలిపివేసిన బార్క్ ఇంకా అదే పరిస్థితి కొనసాగిస్తోంది. నిజానికి 8-12 వారాలపాటు అని చెప్పినప్పటికీ 12 వారాలు గడిచిన తరువాత కూడా ఇప్పట్లో ఇచ్చే అవకాశం కనబడటం లేదు.
ఇలా ఉండగా జనవరి 8 తో ముగిసిన వారానికి తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో స్టార్ మా ఆదరణ స్వల్పంగా తగ్గినా ఇంకా మొదటి స్థానం కొనసాగిస్తోంది. తాజా రేటింగ్స్ లో జాతీయ స్థాయిలో నాలుగో స్థానం కూడా చెక్కు చెదరలేదు. తెలుగులో జీ తెలుగు రెండో స్థానంలోను, ఈ టీవీ మూడో స్థానంలోను, జెమినీ టీవీ నాలుగో స్థానంలోనూ కొనసాగుతున్నాయి.
కార్యక్రమాల విషయానికొస్తే, ఈసారి టాప్ 5 లో స్టార్ మా సీరియల్స్ నాలుగింటికి స్థానం దక్కగా జీ టీవీ సీరియల్ ఒకటి చోటు నిలబెట్టుకుంది. స్టార్ మా సీరియల్ కార్తీక దీపం మొదటి స్థానంలో ఉండగా, ఇంటింటి గృహలక్ష్మి, దేవత గుప్పెడంత మనసు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. జీ తెలుగులో ప్రసారమయ్యే త్రినయని ఈ వారం ఐదో స్థానంలో నిలిచింది. రాధమ్మ కూతురు టాప్ 5 నుంచి వైదొలగాల్సి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here