రూ. 296 కోట్ల సిటీ నెట్ వర్క్స్ బకాయిలపై హెచ్ డి ఎఫ్ సి ఫిర్యాదు

0
1490

ప్రముఖ జాతీయ స్థాయి ఎమ్మెస్వో సిటీ నెట్ వర్క్స్ సంస్థ రూ.296 కోట్ల బకాయి పడినట్టు దివాలా వ్యవహారాల ట్రైబ్యునల్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ కి హెచ్ డి ఎఫ్ సి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై ట్రైబ్యునల్ ముంబయ్ బెంచ్ నుంచి సిటి నెట్ వర్క్స్ కు నోటీస్ అందింది. ఈ విషయాన్ని సిటినెట్ వర్క్స్ స్వయంగా ఎస్సెల్ గ్రూప్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ బోర్డ్ కు తెలియజేసింది. ఏప్రిల్ 13 న నోటీస్ అందిందని, అందులో సమాచారాన్ని పరిశీలిస్తున్నామని ఎస్సెల్ గ్రూప్ సంస్థ సిటీ నెట్ వర్క్స్ తెలియజేసింది.

దివాళా నియమావళి కింద హెచ్ డి ఎఫ్ సి పిటిషన్ దాఖలు చేస్తూ, తాము ఇచ్చిన సొమ్ము బకాయి జనవరి 31, 2022 నాటికి రూ. 2,96,06,48,008 ఉన్నదని కోట్లు తిరిగి ఇవ్వలేదని పేర్కొంది. అయితే, 2022 మార్చి 30 నాడు స్టాక్ ఎక్స్ ఛేంజ్ బోర్డుకు సిటినెట్ వర్క్స్ సమాచారం అందిస్తూ, తమకు హెచ్ డి ఎఫ్ సి నుంచి అందిన నోటీస్ విషయాన్ని వెల్లడించింది.

గతంలో సిటీ కేబుల్ నెట్ వర్క్ పేరుతో ఉన్న ఎస్సెల్ గ్రూప్ వారి ఎమ్మెస్వో ఆ తరువాత కాలంలో సిటీ నెట్ వర్క్స్ గా పేరు మార్చుకుంది. దేశ వ్యాప్తంగా 580 ప్రదేశాలలో ఈ నెట్ వర్క్ ఉండగా దాని ద్వారా కోటీ 13 లక్షల డిజిటల్ చందాదారులకు టీవీ సేవలు అందిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here