పూణె ఫిల్మ్ & టీవీ ఇన్ స్టిట్యూట్ చైర్మన్ గా శేఖర్ కపూర్

0
517

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పూణె కేంద్రంగా పనిచేసే  ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( ఎఫ్ టి ఐ ఐ) చైర్మన్ గా సుప్రసిద్ధ సినీ దర్శకుడు శేఖర్ కపూర్ నియమితులయ్యారు. 2023 మార్చి ఆఖరుదాకా ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి ప్రకాశ్ జావడేకర్ ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ప్రకటనచేశారు.

ఈ నియామకం పట్ల శేఖర్ కపూర్ ప్రభుత్వానికి తన కృతజ్ఞతలు తెలియజేశారు. సృజనాత్మతకు, వైవిధ్య భరితమైన సం స్కృతికి ఆలవాలమైన భారతదేశంలో వాటికి ఆధునిక సాంకేతికతను జోడించి ప్రపంచవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందగలమన్న ధీమా వ్యక్తం చేశారు.పలువురు సినీ, టీవీ రంగ ప్రముఖులు ఆయన నియామకం పట్ల అభినమ్దనలు తెలియజేశారు.

2018లో నియమితుడైన బిపి సింగ్ స్థానంలో ఈ పదవికి ఎంపికైన 75 ఏళ్ళ శేఖర్ కపూర్ సోనీ టీవీలో చిరకాలంగా ప్రసారమవుతున్న సిఐడి కార్యక్రమం నిర్మాతగా చాలామందికి తెలుసు. ఈ మధ్యనే ఆయన భారత సాంస్కృతిక సంబంధాల మండలి సాధారణ సమితి సభ్యునిగా కూడా నియమితులయ్యారు. నాలుగు దశాబ్దాలపాటు ఆయన సినిమా రంగంలో కృషి చేశారు. మిస్టర్ ఇండియా, బాండిట్ క్వీన్, క్వీన్, ఎలిజబెత్, మాసూమ్ తదితర చిత్రాల ద్వారా ఆయన అంతర్జాతీయంగా కూడా ఖ్యాతి గడించారు. 2013లో ఆయన కార్యక్రమం ప్రధానమంత్రి కూడా ప్రఖ్యాతి పొందింది.

సినీ, టీవీ నిర్మాణ రంగానికి సంబంధించి దేశంలో అత్యున్నత శిక్షణా సంస్థగా పూణె ఫిల్మ్ అండ్ టీవీ ఇన్ స్టిట్యూట్ కి  పేరుంది. 1960లో ప్రారంభమైన ఈ సంస్థ పూణెలో ఒకప్పుడు ప్రభాత్ స్టుడియోస్ ఉన్న ప్రాంగణంలో ఏర్పాటైంది.  ఎంతోమంది ప్రతిభావంతులను తీర్చిదిద్దిన సంస్థగా పేరుమోసింది. దర్శకత్వం, స్క్రీన్ ప్లే, సినిమటోగ్రఫీ, ఎడిటింగ్, నటనతోబాటు చిత్ర సమీక్షలుకు సంబంధించిన అంశాలమీద కూదా ఇక్కడ కోర్సులు నిర్వహిస్తారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here