శాంపిల్ సైజు పెంపు కుదరదు: బార్క్

0
539

భారతదేశం లాంటి సువిశాల దేసంలో 130 కోట్ల జనాభా ఉన్నచోట కేవలం 50 వేల ఇళ్ళ ఆధారంగా రేటింగ్స్ నిర్ణయించటం మీద విమర్శలు వెల్లువెత్తుతుండగా బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) ఆ వాదనను తోసిపుచ్చుతోంది. డి ఎన్ ఎ పరీక్ష చేయటానికి ఒక్క చుక్క రక్తం చాలని, లీటర్లకొద్దీ రక్తం సేకరించాల్సిన అవసరం లేదని రక్త నమూనాతో పోల్చి చెబుతున్నరు సీఈవో సునిల్ లుల్లా.
నిజానికి ప్రపంచంలో అతి పెద్ద సంఖ్యలో శాంపిల్స్ తీస్తున్న దేశాల్లో భారత్ లో ఒకటని ఆయన గుర్తు చేశారు. ప్రేక్షకాదరనను ప్రభావితం చేసే అన్ని అంశాలనూ తాము పరిగణనలోకి తీసుకున్నామన్నారు. అనేక ఆడిట్ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ గణాంక నిపుణులు కూడా పరీక్షించి ధ్రువీకరించారన్నారు. శాంపిల్ సైజు పెంచటానికి దీని భాగస్వాములు సిద్ధంగా లేరన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు.
ఇప్పుడున్న 50,000 శాంపిల్స్ స్థానంలో 10 లక్షల శాంపిల్స్ తీసుకున్నప్పటికీ కొత్తగా వచ్చే ప్రయోజనం ఉండదని, పైగా అన్ని శాంపిల్స్ కు డబ్బెవరు కడతారని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు చానల్ యజమానులు, మరోవైపు ఆడ్వర్టయిజర్లిచ్చే డబ్బుతో మాత్రమే రేటింగ్స్ లెక్కింపు సాధ్యమవుతుండగా ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైన సంఖ్య మేరకే శాంపిల్స్ తీస్తున్నట్టు చెప్పారు. వెలుపలి వ్యక్తులకు ఎన్ని అభ్యంతరాలున్నా, ఎన్ని విమర్శలు చేసినా భరించే వారికే ఇది అర్థమవుతుందని వ్యాఖ్యానిస్తూ ఇప్పుడున్న 50 వేల శాంపిల్స్ ను పెంచే అవకాశం లేదని తెగేసి చెప్పారు. “

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here