23న అమెజాన్ ప్రైమ్ లో సైనా నెహ్వాల్ బయోపిక్

0
254

ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత చరిత్రతో రూపొందిన సైనా చిత్రాన్ని ఈనెల 23న తమ డిజిటల్ వేదికమీద ప్రదర్శిస్తున్నట్టు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. ఈ చిత్రం ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలందుకున్న సంగతి తెలిసిందే. స్ఫూర్తిదాయకమైన సైనా నెహ్వాల్ జీవితంలో ఒడిదుడుకులు, క్రీడాకారిణిగా ఆమె సాధించిన విజయాలు, పరాజయాలు తెరకిక్కిస్తూ సాగిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పరిణీతి చోప్రా పోషించారు. ప్రముఖ దర్శకుడు అమోల్ గుప్తే రూపొందించిన ఈ చిత్రాన్ని టి సిరీస్ బానర్ మీద నిర్మాతలు భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, సుజయ్ జయరాజ్, రాకేశ్ షానిర్మించారు.
సైనా పేరుతో తయారైన ఈ చిత్రాన్ని 240 దేశాల్లో ఉన్న అమెజాన్ ప్రేక్షకులు ఇళ్ళలో ఉండే చూసే అవకాశం 23నుంఇ కలగబోతోంది. సైనా బాల్యం, ఆమెకు బాడ్మింటన్ పట్ల ఆసక్తి కలగటం, ఆమె కుటుంబం హర్యానా నుంచి హైదరాబాద్ కు తరలి రావటం , ఆమె జీవితాన్ని ఒక కోచ్ మార్చేయటం, ఆమె సాగించిన పోరాటం. సాధించిన విజయాలు, ప్రపంచ క్రీడా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తీరుతెన్నులు ఈ చిత్రంలో ఉన్నాయి. స్ఫూర్తిదాయక మైన సైనా నెహ్వాల్ జీవిత చరిత్రలో ఆమె వృత్తిగత జీవితాన్ని ఆసక్తికరంగా అందించటానికి పరిణీతి చోప్రా నటన ఎంతగానో దోహదం చేసింది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ చిత్రం ప్రపంచమంతటా అందుబాటులోకి రావటం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పరిణీతి చోప్రా వ్యాఖ్యానించారు. సాహసోపేతమైన కలగని ఆ కలను సాకారం చేసుకున్న అమ్మాయిగా సైనా నెహ్వాల్ జీవిత కథ ఎంతో స్ఫూర్తినిస్తుందన్న నమ్మకంతోనే ఈ చిత్ర నిర్మాణం చేపట్టామని నిర్మాత భూషణ్ కుమార్ చెప్పారు. సైనా చిత్రం తమ ఇళ్లలోకి వస్తుందని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నవారికి ఇదొక అద్భుత అవకాశమని చెబుతూ, అందరినీ ఈ చిత్రం ఆకట్టుకుంటుందని దర్శకుడు అమోల్ గుప్తే ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here