ప్రాంతీయ భాషల్లోకి రిపబ్లిక్ టీవీ

0
524

న్యూస్ చానల్ రిపబ్లిక్ టీవీ వచ్చే మార్చినాటికల్లా ఆరు ప్రాంతీయ భాషల్లోకి రావాలనుకుంటోంది. ఇప్పటికే ఉన్న కొన్ని చానల్స్ ను కొనుగోలు చేయటానికి చర్చలు కూడా జరిగాయని రిపబ్లిక్ వ్యవస్థఅపకుడు ఆర్ణబ్ గోస్వామి ఒక టీవీ న్యూస్ పోర్టల్ కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆరునుంచి పది భాషల్లో తీసుకురావాలని అనుకోగా జోవిడ్ కారణంగా ఆలస్యమైనట్టు చెప్పారు. మొదట్లో తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ రిపబ్లిక్ వాల్డ్ ను ఇతర భాషల్లోకి విస్తరించాలని ఆలోచించినప్పటికీ కరోనా సంక్షోభం కారణంగా కొంత కాలం వాయిదావేశామన్నారు. అయితే, ఈ వాయిదా తాత్కాలికమేనని, ఈ ఏడాదే డిజిటల్ విస్తరణ జరుగుతుందని చెప్పారు.
అనేక భాషలకు చెందిన చానల్ యజమానులు అమ్మకానికి సిద్ధమై చర్చలు జరపటానికి వచ్చారని, అయితే వీటిని కూడ కరోనా కారణంగానే ముందుకు తీసుకువెళ్ళలేదని అన్నారు. రిపబ్లిక్ లో బెంగళూరుకు చెందిన బిజెపి రాజ్యసభ సభ్యుడి సంస్థకు గతంలో సుమారు 15% వాటా ఉండగా, ఇందులో ఎక్కువభాగం ఆర్ణబ్ కొనుగోలు చేయటంతో ఆయనే ఇప్పుడు యజమానిగా మారారు. వార్తా సంస్థను పూర్తిగా జర్నలిస్ట్ నడపాలే తప్ప తెర వెనుక ఉండే యజమాని నడపటం సమంజసం కాదనేది చంద్రశేఖర్ అభిప్రాయమని అందుకే తాను పూర్తిగా తీసుకున్నానని చెప్పారు.
2017లో రిపబ్లిక్ ప్రారంభమైనప్పటినుంచే మొదటి స్థానంలోకి దూసుకుపోయి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ వారి టైమ్స్ నౌ చానల్ ను దాటిపోయిందన్నారు. తన జర్నలిజం కెరీర్ అక్కడే ప్రారంభమై ఎదిగిన సంగతి గుర్తు చేస్తూ తొలివారం నుంచీ రేటింగ్స్ లో ఆ చానల్ ను దాటిపోవటాన్ని కూడా ప్రస్తావించారు. ఆ తరువాత రిపబ్లిక్ గ్రూప్ ప్రారంభించిన రిపబ్లిక్ భారత్ అనే హిందీ న్యూస్ చానల్స్ సైతం ప్రేక్షకాదరణ పెంచుకోగలిగిందని, ఆజ్ తక్ ను దాటిపోయి గడిచిన రెండువారాల్లో నెంబర్ వన్ స్థానం సంపాదించుకుందని చెప్పారు. సంచలనాలతో న్యూస్ పరిశ్రమను కలుషితం చేస్తున్నట్టు తనమీద వస్తున్న ఆరోపణలను ఆర్ణబ్ కొట్టిపారేశారు. రేటింగ్స్ కోసం టీవీ సీరియల్స్ మీద కార్యక్రమాలు తయారుచేసే అలవాటు తమ హిందీ చానల్ కు లేదంటూ పరోక్షంగా ఆజ్ తక్ ను విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here