జాతీయ చానల్స్ ను మించిపోయిన ప్రాంతీయ చానల్స్

0
472

రేటింగ్స్ లో జాతీయ స్థాయి చానల్స్ కంటే ప్రాంతీయ ఛాన్సల్ ప్రేక్షకాదరణే ఎక్కువగా ఉంటోంది. ఆగస్టు 27 తో ముగిసినవారానికి బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్) జారీ చేసిన ప్రేక్షకాదరణ సమాచారం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. పెద్ద నెట్ వర్క్స్ లో సైతం వాటి ప్రధాన చానల్ కంటే ప్రాంతీయ ఛాన్సల్ ఎక్కువ రేటింగ్స్ సంపాదించుకోవటం గమనార్హం. తాజా రేటింగ్స్ ఫలితాల ప్రకారం జాతీయ స్థాయిలో నెంబర్ వన్ స్థానంలో తమిళ చానల్ సన్ టీవీ ఉండగా రెండో స్థానం స్టార్ మా (తెలుగు) చానల్ కు దక్కింది. అదే విధంగా ఆరో స్థానంలో తమిళ చానల్ స్టార్ విజయ్ ఉండగా, ఎనిమిదో స్థానం జీ తెలుగుకు, తొమ్మిదో స్థానం జీ కన్నదకు దక్కాయి. ఆ విధంగా టాప్ 10 జాబితాలో రెండు తమిళ, రెండు తెలుగు, ఒక కన్నడ చానల్ చోటు సంపాదించుకున్నట్టయింది. ఇంకా ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే స్టార్ గ్రూప్ లో ప్రధానమైన జాతీయ చానల్ స్టార్ ప్లస్ కంటే తెలుగు చానల్ స్టార్ మా ముందుండటం విశేషం. అదే విధంగా జీ గ్రూప్ వారి హిందీ ఛానల్స్ ఏవీ టాప్ 10 లో స్థానం దక్కించుకోకపోగా జీ తెలుగు, జీ కన్నడ మాత్రం 8, 9 రాంకుల్లో నిలిచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here