టీవీ రేటింగ్స్ శాంపిల్ ఇకమీదట కోటి?

0
630

టెలివిజన్ రేటింగ్స్ మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయగా, శాంపిల్ సైజు కోటికి పెంచటం మీద కూడా కమిటీ అభిప్రాయం వెల్లడిస్తుందని సమాచార, ప్రసార శాఖామంత్రి ప్రకాశ్ జావడేకర్ సూచనప్రాయంగా చెప్పారు. ప్రసార భారతి సీఈవో శశి వెంపటి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇప్పుడున్న రేటింగ్స్ వ్యవస్థను అధ్యయనం చేసి సిఫార్సులు కేంద్రానికి అందజేయాల్సి ఉంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 వేల మీటర్లు అమర్చి వాటి సాయంతో బ్రాడ్ కాస్ట ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) సంస్థ ప్రేక్షకాదరణను సూచించే రేటింగ్స్ లెక్కలు వెల్లడిస్తూ వస్తోంది. అయితే, శాంపిల్ సైజు తక్కువగా ఉండటం వల్లనే కొన్న్ని చానల్స్ ఆ ఇళ్లను లక్ష్యంగా చేసుకొని అక్రమాలకు పాల్పడుతూ అడ్దదారుల్లో రేటింగ్స్ సంపాదించు కుంటున్నాయనే ఆరోపణలున్నాయి. “ అందుకే శాంపిల్స్ సంఖ్యను కోటి చేస్తే అప్పుడు అక్రమాలకు వీలుండదు కదా? “ అని మంత్రి ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం కూడా పరిశీలించి కమిటీ తన నివేదికను త్వరలోనే అందజేస్తుందని చెప్పటం ద్వారా మంత్రి తన మనసులో మాట చెప్పినట్టయింది.
బార్క్ లో అటు బ్రాడ్ కాస్టర్లు, ఇటు అడ్వర్టయిజర్లు ఉన్నందున ప్రభుత్వం బార్క్ వ్యవహారాలలో జోక్యం చేసుకోవాలనుకోవటం లేదని కూడా జావడేకర్ స్పష్టం చేశారు. కానీ, ఫిర్యాదులు వస్తునందున తప్పనిసరి పరిస్థితుల్లోనే జోక్యం చేసుకోవాల్సి వస్తున్నదన్నారు. అన్ని టీవీ న్యూస్ చఅనల్స్ కూ ఒక ఉమ్మడి నియమావళి రూపొందించ బోతున్నట్టు పేర్కొన్నారు. జస్టిస్ సిక్రీ అధ్యక్షతన ఒక సంఘం ఉన్నప్పటికీ దానికి ఫిర్యాదు చేయటానికి వీలులేకుందా అన్ని చానల్స్ ఆ సంఘంలో సభ్యులు కాదన్న విషయం గుర్తు చేశారు. అందుకే అస్న్నిటికీ కలిపి ఉమ్మడి నియమాలు వర్తించేలా త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నమన్నారు.
ప్రెస్ కౌన్సిల్ కు మరిన్ని అధికారాలిచ్చే విషయం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదన్నారు. ఇక ఒటిటి వేదికల విషయానికొస్తే పత్రికలకున్నట్టు ప్రెస్ కౌన్సిల్ గాని, టీవీ చానల్స్ కు ఉన్న నియంత్రణా వ్యవస్థగాని లేనందున వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం సలహాలు తీసుకుంటున్నదన్నారు. రోజూ ఒటిటి ప్రసారాలమీద అనేక ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయన్నారు. ఈ మధ్యనే డిజిటల్ వేదికలను సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలో చేర్చటం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here