రాంకులు మారని తెలుగు చానల్స్:

0
518

టాప్ 5 కార్యక్రమాల్లో 4 స్టార్ మా సొంతం
జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో తాజా బార్క్ రేటింగ్స్ ప్రకారం రాంకులు మారకపోయినా, మా టీవీ ఆదరణ కొద్దిగా తగ్గింది. రెండో స్థానంలో ఉన్న జీ తెలుగు గతవారం కాస్త తగ్గినా ఇప్పుడు మళ్ళీ బాగా పుంజుకుంది. మూడో స్థానంలో ఉన్న ఈటీవీ, నాలుగో స్థానంలో ఉన్న జెమిని టీవీ కూడా పెరుగుదల నమోదు చేసుకున్నప్పటికీ రాంకులు మాత్రం మెరుగుపరచుకోలేకపోయాయి. దేశ వ్యాప్తంగా అన్ని చానల్స్ లో చూసినప్పుడు టాప్ 10 లో స్టార్ మా కు తొమ్మిదో స్థానం, జీ తెలుగుకు పదో స్థానం దక్కాయి.
రాంకు చానల్ వీక్షణల మొత్తం ( వేలల్లో )
29వ వారం (జులై 18-24)
1 స్టార్ మా 607748
2 జీ తెలుగు 538073
3 ఈటీవీ తెలుగు 495654
4 జెమిని టీవీ 420282

టాప్ 5 కార్యక్రమాల్లో మా టీవీ విజృంభించింది. పూర్వ వైభవం కొనసాగిస్తున్నట్టు నిరూపించుకుంటూ నాలుగు రాంకులు సంపాదించింది. నాలుగూ సీరియల్స్ కావటం మరో విశేషం. ఈ టీవీ తెలుగు చానల్ తన న్యూస్ బులిటెన్ కు నాలుగో రాంకును కొనసాగించుకోగలిగింది. నెంబర్ వన్ కార్యక్రమంగా ఈ వారం కూడా కార్తీక దీపం తన ఆధిక్యాన్ని చాటుకుంది. రెండో రాంకు ఇంటింటి గృహలక్ష్మికి రావటంతో టాప్ 5లోకి వచ్చి చేరినట్టయింది. వదినమ్మ ఈవారం కూదా తన మూడో స్థానాన్ని నిలుపుకుంది. మౌనరాగం కూడా పైకి ఎగబాకి ఐదో స్థానంతో టాప్ 5 జాబితాలో స్థానం పొందింది. ఆ విధంగా మా టీవీ సీరియల్స్ కార్తీక దీపం, ఇంటింటి గృహలక్ష్మి, వదినమ్మ, మౌనరాగం టాప్ 5 కార్యక్రమాల్లో చేరినట్టయింది.
రాంకు చానల్ కార్యక్రమం వీక్షణల మొత్తం ( వేలల్లో )
29వ వారం(జులై 18-24)
1 స్టార్ మా కార్తీక దీపం 12820
2 స్టార్ మా ఇంటింటి గృహలక్ష్మి 7355
3 స్టార్ మా వదినమ్మ 7043
4 ఈటీవీ తెలుగు ఈటీవీ న్యూస్ 6717
5 స్టార్ మా మౌనరాగం 5926

తెలుగు న్యూస్ చానల్స్ అన్నిటికీ ప్రేక్షకాదరణ స్వల్పంగా తగ్గినా, రాంకులు మాత్రం మారలేదు. టీవీ9 నెంబర్ వన్ స్థానంలో ఉండగా రెండవ స్థానంలో ఎన్టీవీ, మూడో స్థానంలో టీవీ 5 న్యూస్, నాలుగో స్థానంలో వి6 న్యూస్, ఐదో స్థానంలో టి న్యూస్ కొనసాగుతూ ఉన్నాయి.
రాంకు చానల్ వీక్షణల మొత్తం ( వేలల్లో )
29వ వారం (జులై 18-24)
1 టీవీ9 83762
2 ఎన్టీవీ 62505
3 టీవీ 5 న్యూస్ 47447
4 వి6 న్యూస్ 42557
5 టి న్యూస్ 30940

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here